కృష్ణాష్టమి రోజూ ఇంట్లోకి ఈ వస్తువులను తీసుకొస్తే మీ ఇంట్లో దేనికీ లోటు ఉండదు
krishna janmashtami 2023: జన్మాష్టమీ రోజున బాల గోపాలుడికి ఇష్టమైన వస్తువులను ఇంట్లోకి తీసుకువస్తే శుభం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటంటే..
krishna janmashtami 2023: శ్రీకృష్ణుడు జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ జన్మాష్టమీ రోజున శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం కూడా ఉంటుంటారు. కాగా ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదో రోజున జన్మాష్టమిని జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. జన్మాష్టమీ రోజున కృష్ణయ్యను పూజించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ రోజున కృష్ణుడిని పూజించాలి. ఈ రోజు 12 గంటలకు భగవంతుడిని పూజిస్తారు. అయితే ఈ రోజు మీ ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకొస్తే కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడట. అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దేవుడి అనుగ్రహం కూడా పొందుతారు. ముఖ్యంగా దీనివల్ల మీ ఇంట్లో దేనికీ లోటు ఉండదు. ఇందుకు మీ ఇంట్లోకి ఏయే వస్తువులను తీసుకురావాలంటే?
జన్మాష్టమీ తేది
ఈ ఏడాది జన్మాష్టమి తేదీపై అయోమయం నెలకొంది. ఈ పండుగను సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7 తేదీలలో జరుపుకుంటారు.
భాద్రపద కృష్ణ జన్మాష్టమి తేదీ ప్రారంభం - సెప్టెంబర్ 06.. మధ్యాహ్నం 03.37 గంటలకు.
భాద్రపద కృష్ణ అష్టమి తిథి ముగింపు- సెప్టెంబర్ 07 .. సాయంత్రం 04.14 గంటలకు
Janmashtami 2023 Upay
ఆవులు, దూడలు
శ్రీకృష్ణుడికి ఆవులు, దూడలంటే ఎంతో ఇష్టమట. శ్రీ కృష్ణుడి వల్లనే ఆవుకు తల్లి అనే బిరుదు వచ్చిందని మత గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఆవులను గోమాత అని పిలుస్తారు. అయితే జన్మాష్టమి నాడు ఆవు, దూడల చిన్న చిన్న విగ్రహాలను కొని ఆలయంలో ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆవులను పూజిస్తే మంచి ఫలితం పొందుతారు.
Janmashtami 2023 Upay
వైజయంతి మాల
శ్రీకృష్ణుడి మెడలో వైజయంతీ మాల ఖచ్చితంగా ఉంటుంది. అందుకే జన్మాష్టమీ నాడు మీరు వైజయంతీ మాలలను మీ ఇంటికి తీసుకురావొచ్చు. జన్మాష్టమి నాడు ఈ ఇంటిని వైజయంతి మాలను తీసుకొస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఆమె అనుగ్రహాన్ని కూడా పొందుతారు. పేదరికం కూడా తొలగిపోతుంది.
Janmashtami 2023 Upay
వేణువు
శ్రీకృష్ణుడి చేతిలో వేణువు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడికి వేణువంటే చాలా ఇష్టం. జన్మాష్టమి రోజున కృష్ణుడికి చెక్క లేదా వెండి వేణువును సమర్పిస్తే మంచిది. ఈ రోజు పూజ చేసిన తర్వాత దానిని సురక్షితమైన ప్రదేశంలో లేదా డబ్బులను ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండదు. పేదరికానికి చోటు ఉండదు.
Janmashtami 2023 Upay
నెమలి ఈక
నెమలి ఈక శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. జన్మాష్టమి నాడు నెమలి ఈకలను కొని ఇంటికి తీసుకురండి. దీనివల్ల దుష్ట శక్తులు మీ ఇంట్లో తిరగవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. నెమలి ఈకలు గృహ కలహాలకు కారణం కావు. ఇది మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాన్ని కూడా పోగొడుతుంది.
Janmashtami 2023 Upay
శంఖం
విష్ణువు అవతారమే శ్రీకృష్ణుడు. అయితే విష్ణువు భార్య లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే జన్మాష్టమి రోజున మీ ఇంటికి శంఖం తీసుకువస్తే మంచిది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు.