అసలు కార్తీక మాసాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
Karthika Masam 2023: కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో ఎనిమిదో చంద్రమాసాన్ని కార్తీక మాసం అంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక మాసం నవంబర్ లో వస్తుంది. అసలు ఈ కార్తీక మాసాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం పదండి.
చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. ఎంతో అదృష్టకరమైన మాసం కార్తీక మాసం. ఈ పండుగను ప్రతీ ఏడాది నవంబరలో జరుపుకుంటాం. దక్షిణాయణం, ఉత్తరాయణం చాంద్రమాన క్యాలెండర్ లోని రెండు భాగాలు. దక్షిణాయణంలో కార్తీక మాసం ఉంటుంది. సాధనకు మంచి సమయం దక్షిణాయణం. సాధన మోక్షాన్ని పొందే పద్ధతిని సూచిస్తుంది. అందుకే చాంద్రమాన క్యాలెండర్ లో.. కార్తీక మాసాన్ని అత్యంత అదృష్టకరమైన మాసంగా పరిగణిస్తారు.
కార్తీక మాసంలో పరమేశ్వరుడిని, శ్రీమహావిష్ణవును పూజిస్తారు. వీరి అనుగ్రహం పొందేందుకు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు. అందుకే కార్తీక మాసంలో శివుడు, విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. శివుడు, విష్ణువు ఇద్దరు వేరువేరు కాదని ఈ మాసం మనకు తెలియజేస్తుంది.
కార్తీక మాసాన్ని ఎందుకు జరుపుకుంటాం
కార్తీక మాసం శివుడు, మహావిష్ణువుకు అంకితం చేయబడిన పండుగ. దీనిని నెల రోజుల పాటు జరుపుకుంటాం. ఈ మాసంలో మొదటిది ఆశ్వయుజ శుక్ల పౌర్ణమి. వైష్ణవులు, శైవులు ఇద్దరూ ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో శివకేశవులను పూజించడం వల్ల శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది.
కార్తీక మాసంలో శివ భక్తులు ఉపవాసం ఉంటారు. ఎన్నో వ్రాతాలు చేస్తారు. అలాగే ప్రతి సోమవారం ఉపవాసాలు ఉంటారు. ఈ మాసంలో దానాలు చేయడం ఎంతో శుభప్రదంగా కూడా భావిస్తారు. అందుకే ఈ మాసంలో వస్త్రదానం, స్వర్ణదానం, గోదానం వంటివి చేస్తుంటారు. ఇవి పరమేశ్వరుడి అనుగ్రహం పొందేలా చేస్తాయని భక్తుల నమ్మకం.
కార్తీక మాసం వెనకున్న శాస్త్రీయ కారణాలు
కార్తీక స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర స్నానం అనేది మన శారీరక, మానసిక కలుషితాలను కడుగుతుంది. అలాగే భావోద్వేగ భావాలను శుద్ధి చేస్తుంది. నీరు శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యోదయానికి ముందు ఈ నీటిలో ప్రత్యేకమైన విద్యుదయస్కాంత శక్తి ఉంటుంది. అదుకే ఈ నెలలో గంగా నీటిలో స్నానం చేయడం వల్ల కాలెయం, కడుపు, ఇతర సాధారణ రోగాలు నమయమైపోతాయిని చెప్తారు.
ఈ మాసంలో మనం తులసిని కూడా పూజిస్తాం. ఈ తులసి ఆకులు గాలిలోని వ్యాధి కారక రసాయన, బాక్టీరియల్ కాలుష్య కారకాలను తొలగిస్తుంది. మీకు తెలుసా? తులసి మొక్కను ఉబ్బసంతో పాటుగా ఇతరులతో ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. తులసి మొక్కకు దగ్గరగా దీపాన్ని వెలిగించడం వల్ల సంపద లభిస్తుందని నమ్ముతారు. అలాగే పాపాలన్నీ తొలగిపోతాయి.
ఉపవాసం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ ఉపవాసం వల్ల మీరు తక్కువగా, ఆరోగ్యకరమైన వాటినే తింటారు. దీంతో మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
ఈ మాసంలో ఉదయం, సాయంత్రం పూట ధ్యానం చేస్తుంటారు. ఈ ధ్యానం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కార్తీక మాసంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ఉండటం, తులసి మొక్క రెండూ ముఖ్యమైన అంశాలు. ఈ రెండు ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియా, కీటకాలతో మన శరీరం పోరాడటానికి, అనారోగ్యంతో పోరాడటానికి సహాయపడతాయి.