Maha shivratri: మహా శివరాత్రి రోజు శివుడికి పూజచేయక్కర్లేదా..? ఉపవాసమొక్కటే చాలా?
Maha shivratri: భక్తితో మంచి నీళ్లతో పూజ చేసినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అంటుంటారు. అయితే శివరాత్రినాడు కేవలం ఉపవాసం ఉండి పూజ చేయకపోయినా.. ఆ పరమేశ్వరుని చల్లని దీవెనలు భక్తులపై ఉంటాయట.
Maha shivratri: మహా శివరాత్రి ఎంతో పవిత్రమైనది. పుణ్యప్రదమైంది. శివరాత్రి భోళాశంకరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ రోజున ఆ దేవదేవుడి అనుగ్రహం కోసం.. భక్తులు ఉపవాసాలు, జాగరణ, బిల్వార్చన, శివనామ స్మరణతో నిష్టగా పూజిస్తుంటారు.
శివ అంటే శుభప్రదం, మంగళకరమని అర్థం. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అని అర్థం. అయితే రాత్రి (చీకటి) అంటే అజ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. అలాంటిది రాత్రి మంగళకరమైంది ఎలా అవుతుందని అని చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం, జాగరన చేయడం, బిల్వార్చన, అభిషేకం, శివనామ స్మరణతో చీకటి తెరలు తొలగి పోయి అంతా జ్ఞాన వెలుగు ప్రసరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి
పురాణాల ప్రకారం.. పరమేశ్వరుడిని శివరాత్రి గురించి పార్వతి అడిగప్పుడు శివుడు ఇలా చెప్పాడట. ‘మహా శివరాత్రి తనకెంతో ప్రీతిపాత్రమైందని, ఆ రోజున భక్తులు ఏమి చేయకపోయినా.. ఒక్క ఉపవాసముంటే చాలు నేనెంతో సంషితాస్తాను’అన్నాడట. పురాణాల ప్రకారం.. శివరాత్రి రోజున భక్తులు నిష్టగా ఉపవాసం ఉండాలి. అలాగే రాత్రి నాలుగు జాముల్లో శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తే చాలట.
అభిషేకంలో ముందుగా పాలు, ఆ తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకిస్తే ఈ పరమేశ్వరునికి ఎంతో సంతోసం కలుతుందట. ఇక మరుసట రోజు నిష్టగా దేవుడికి నైవేద్యం సమర్పించి శివరాత్రి ఉపవాసాన్ని పూర్తిచేయాలట. దీనిని మించిన పూజలు, వ్రతాలు ఏమీ అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఓంకార స్వరూపంగా కొలువొందిన పరమేశ్వరుడు.. కోరిన వరాలు తీరుస్తాడని భక్తులు నమ్ముతుంటారు. అందుకే మొక్కులు మొక్కుకొని ఆ శివయ్యను దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఇతర రోజుల కంటే ఈ శివరాత్రి పర్వదినం ఎంతో పవిత్రమైంది. ఈ పర్వదినాన శివుడి అనుగ్రహం పొందాలంటే నిష్టగా ఆ దేవుడిని పూజించాలి. ఉపవాసం చేయాలి.