రామ ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలంటే?
Rama Ekadashi: రామ ఏకాదశి ఉపవాసం అంటే మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మోక్షం పొందడానికి మనల్ని మనం సిద్దం చేసుకోవడం. అంతేకాదు దుష్ట గ్రహాల ప్రభావాలను వదిలించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.
రామ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజు ఉండే ఉపవాసం ఆధ్యాత్మిక ప్రక్షాళనకు సంబంధించినది. రాజ్యానికి రక్షక అధిపతి అయిన విష్ణుమూర్తిని ఈ రోజు నిష్టగా పూజిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం శ్రీమహావిష్ణు అనుగ్రహం పొందడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి?
విష్ణుమూర్తిని ఆరాధించే వారు ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఉపవాస ఫలాలను పొందుతారనే నమ్మకం ఉంది. ఏకాదశి ఉపవాసం మీకుక శాంతి, సామరస్యం , శ్రేయస్సును, సుఖ సంతోషాలను కలిగిస్తాయని నమ్ముతారు.
ఏకాదశి ఉపవాసం ముఖ్యతను విష్ణుమూర్తి యుధిష్ఠిరుడికి వివరించాడట. నిజమైన విశ్వాసులు ఆత్మను శుద్ధి చేయడానికి, మోక్షం పొందడానికి ఈ రోజును ఆచరించాలని ఆయన అన్నారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మోక్షాన్ని పొందడమే మానవ జీవితం ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి ఈ ఉపవాసం అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండేవారికి మనశ్శాంతి, శ్రేయస్సు లభిస్తాయనే నమ్మకం ఉంది.
ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి?
గర్భిణులు, ఆరోగ్యం బాగాలేనివారు, వృద్ధులు ఈ ఉపవాసం చేయకూడదు.
దృఢ సంకల్పం, లోతైన ఆధ్యాత్మికత ఉన్నవారు మాత్రమే నియమాల ప్రకారం ఈ ఉపవాసాన్ని ఆచరించాలి.
ఉపవాసం టైంలో ఫుడ్, వాటర్ ను అస్సలు ముట్టుకోకూడదు. అయితే నిర్జల ఏకాదశి జరుపుకోలేని వారు పండ్లు, పాలను తీసుకోవచ్చు.
ఆహార ధాన్యాలు, మాంసం, చేపలను తినడం వంటి పనులను అస్సలు చేయకూడదు.
ఉపవాసం సూర్యోదయానికి ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగించాలి. ఈ ఉపవాసాన్ని ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేచి శుద్ధి స్నానం చేసి "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే విష్ణు మంత్రాన్ని జపించాలి.
ఈ ఉపవాస దీక్షను ఆచరించే వారు హింస, మోసం, అబద్ధాలకు దూరంగా ఉండాలి.
ఉపవాసం అంటే మీరు పూర్తి ఆహారాన్ని పరిమితం చేయడమే కాదు ప్రామాణిక పరిశుభ్రతను కూడా పాటించాలి. పండ్లను, పాలను ఉపవాసం ఉన్నవారు తీసుకోవచ్చు. వ్యక్తి తీసుకోవచ్చు. ఉపవాసానికి సంబంధించిన అనేక చిన్న కథలు ఉన్నాయి మరియు హిందూ మతం యొక్క పవిత్ర మరియు పవిత్ర గ్రంథంలో ఉన్నాయి.