- Home
- Life
- Spiritual
- Rakhi 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయడం శుభప్రదం, ఒక్కో ముడికి ఒక్కో అర్థం
Rakhi 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయడం శుభప్రదం, ఒక్కో ముడికి ఒక్కో అర్థం
ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. రాఖీ పండుగ రోజు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టినప్పుడు ఎన్ని ముడులు వేయాలో కూడా తెలుసుకోవాలి. ఇది వారి ప్రేమకు, రక్షణకు ప్రతీకలా నిలుస్తుంది.

రాఖీ పండుగ 2025
అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా చేసే పండుగ రాఖీ పౌర్ణమి. దీన్నే రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఆగస్టు 9న రక్షాబంధన్ పండుగ నిర్వహించుకోబోతున్నాం. ఆరోజు భద్రకాలం కూడా లేదు. అంటే పౌర్ణమి ఉన్న సమయంలో ఎప్పుడైనా మీరు రాఖీని కట్టవచ్చు. సూర్యోదయం నుండే పండుగను నిర్వహించుకోవడం మొదలు పెట్టవచ్చు. అయితే రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా మందికి ఆ నియమాలు ఏమిటో తెలియదు. ఈ నియమాలను పాటించడం వల్ల అన్నాచెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు అంతా మేలే జరుగుతుంది.వారికి రాఖీ కట్టిన ఫలితం దక్కుతుంది.
ఎన్ని ముడులు వేయాలి?
శ్రావణ పౌర్ణమి రోజు సోదరి... తన సోదరుడికి మణికట్టుపై ప్రేమ దారాన్ని కడుతుంది. అదే రాఖీ. రాఖీ వేసే కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం శుభప్రదం అని చెబుతారు. మొదటి ముడి సోదరుడికి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. రెండవ ముడి కట్టిన సోదరికి దీర్ఘాయుష్షును అందిస్తుంది. ఇక మూడవ ముడి వారి సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుంది.
బొట్టు ఎలా పెట్టాలి?
రాఖీ కట్టే దానికి ముందు సోదరుడికి బొట్టు పెట్టాలి. సోదరి నుదుటిపై బొట్టు పెట్టినప్పుడు ఉంగరపు వేలితోనే పెట్టడం మంచిది. బొటనవేలుతో పెట్టకూడదు. ఆ తర్వాత ఆ బొట్టుపై బియ్యపు గింజలు కూడా వేసి సోదరుడికి దీర్ఘాయుష్షు కావాలని కోరుకోవాలి. ఆ తర్వాత స్వీటు తినిపించాలి. ఇలా చేయడం వల్ల వారిద్దరి జీవితంలోని తీయని క్షణాలు రెట్టింపు అవుతాయి. దీని తర్వాత సోదరుడు తన సోదరికి నచ్చిన బహుమతులను అందించవచ్చు.
ఏ దిశలో కూర్చోవాలి?
రాఖీ కట్టేటప్పుడు ఏ దిశలో కూర్చోవాలో కూడా తెలుసుకోవాలి. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేటప్పుడు సోదరి పశ్చిమ దిశ వైపు, సోదరుడు ఈశాన్య దిశ వైపు ఉండడం మంచిది. ఆ దిశలోనే ఉండి రాఖీ కడితే మరిన్ని తీపి జ్ఞాపకాలు వారి జీవితంలో పెరుగుతాయి.
ఏ చేతికి కట్టాలి?
రాఖీ కట్టేటప్పుడు ఏ చేతికి కట్టాలో కూడా తెలుసుకోవాలి. శుభసమయంలో శుభ ముహూర్తంలో సోదరిని కుడి చేతి మణికట్టుపైన ఈ రక్షా సూత్రాన్ని కట్టాలి. ఇలా అన్ని విధాలా శుభప్రదమైనది. ఎట్టి పరిస్థితుల్లో ఎడమ చేతికి కట్టకూడదు. కుడి చేతికి కట్టడం వల్లే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.