Vastu tips: ఇంట్లో మంచి జరగాలంటే వీటిని వెంటనే బయట పడేయండి!
వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం అస్సలు మంచిది కాదు. అవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇలాంటి వస్తువులను వెంటనే బయట పడేయాలటంటున్నారు వాస్తు నిపుణులు. ఏ వస్తువులను ఇంట్లో ఉంచకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఇళ్లు, ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు. అందుకు అనుగుణంగానే ఇంట్లో వస్తువులు అమర్చుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదట. ఇంతకీ ఎలాంటి వస్తువులను ఇంట్లో ఉంచకూడదో ఇక్కడ చూద్దాం.
విరిగిన విగ్రహాలు
వాస్తు ప్రకారం ఇంట్లో విరిగిన విగ్రహాలు ఉంటే అశుభం. వాటిని వెంటనే నదిలో కలిపేయాలి. లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
ఆగిపోయిన గడియారం
ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అదృష్టం కూడా ఆగిపోతుందట. వెంటనే దాన్ని రిపేర్ చేయించడం లేదా బయట పడేయడం చేయాలి. వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే ఆర్థిక నష్టాలు వస్తాయట.
పగిలిన అద్దం
పగిలిన అద్దం ఇంట్లో ఉంటే అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది. పగిలిన అద్దం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుందట. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కాబట్టి పగిలిన అద్దం ఇంట్లో నుంచి తీసేయడం మంచిది.
ఉగ్రంగా ఉండే విగ్రహాలు
ఉగ్రంగా ఉండే దేవుడి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టకూడదు. అవి కీడుకు కారణంగా భావిస్తారు. వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో ఉంచకపోవడమే మంచిది.
చిరిగిన పుస్తకాలు
చిరిగిన పుస్తకాలను కూడా ఇంట్లో ఉంచకూడదు అంటారు. ఒకవేళ అవి భక్తికి సంబంధించిన పుస్తకాలు అయితే వాస్తు ప్రకారం వాటిని పారే నీటిలో వేయాలట. దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.