వినాయక చవితి రోజు చంద్రుడిని పొరపాటున కూడా చూడకండి.. ఒకవేళ చూశారో..!
Ganesh Chaturthi 2023: వైదిక క్యాలెండర్ ప్రకారం.. భాద్రపద మాసం శుక్లపక్షంలో నాల్గో రోజు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటాం.. అయితే ఈ ప్రత్యేకమైన రోజున చంద్రుడిని అస్సలు చూడకూడదని నమ్ముతారు. ఒకవేళ చూస్తే మాత్రం..
Ganesh Chaturthi 2023: భాద్రపద శుక్లపక్షంలో చతుర్థి అంటే వినాయక చవితి రోజ చుంద్రుడిని చూడకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రోజు చంద్రుడిని చూడటం అశుభంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. వినాయకుడిని చూసి చంద్రుడు చూసి నవ్వుతాడు. దీంతో కోపం వచ్చిన వినాయకుడు చంద్రుడిని శపిస్తాడు. ఈ శాపంతో చంద్రుడు తన వెన్నెలను కోల్పోతాడు. ఇలాంటి రోజున మనం చంద్రుడిని చూడటం వల్ల మనిషిపై అపోహలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైనా అనుకోకుండా చంద్రుడిని చూస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చంద్రుడి ప్రాముఖ్యత శాస్త్రీయ కోణంలోనే కాదు ధార్మిక, జ్యోతిష పరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. పౌర్ణమి రోజున చంద్రుడిని చూడటం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని నమ్ముతారు. పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తే జీవితంలో సంపద పెరుగుతాయి. సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. హిందూ విశ్వాసం ప్రకారం.. పెళ్లైన ఆడవారు చంద్రుడు ఉదయించిన తర్వాతే ఉపవాసం పూర్తి చేస్తారట. అయితే హిందూ క్యాలెండర్ లో చంద్రుడి దర్శనాన్ని అశుభంగా భావించే రోజు కూడా ఉంది.అదే భాద్రపద శుక్లపక్షంలో చతుర్థి రోజు.. అంటే వినాయక చవితి. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే మీరు దొంగతనం చేసినట్టుగా ఆరోపణలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు చంద్రుడిని చూడరు.
వినాయక చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
పురాణాల ప్రకారం.. పరమేశ్వరుడు ఆవేశంతో వినాయకుడి తలను నరికిన తర్వాత పార్వతీ దేవి ఎంతో బాధపడుతుంది. నా కొడుకును ఎలాగైనా బతికించమని వేడుకుంటుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సుతో వినాయకుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. ఈ సమయంలో దేవతలందరూ వినాయకుడు తిరిగి బతికినందుకు ఆశీర్వదిస్తుంటారు. అయితే అక్కడే ఉన్న చంద్రుడు మాత్రం నవ్వుతూ నిలబడుతాడు. చంద్రుడు తన ముఖాన్ని చూసి నవ్వుతున్నాడని గ్రహించిన వినాయకుడికి కోపం వచ్చి చుంద్రుడిని 'నువ్వు ఎప్పటికీ నల్లగా ఉంటావు' అని శపిస్తాడు. ఈ శాపం వల్ల చంద్రుడు తన స్వంత రూపాన్ని కోల్పోతాడు. అప్పుడు చంద్రుడు తన తప్పును గ్రహించి గణపయ్యను క్షమించమని కోరుతాడు. దీంతో వినాయకుడు ఒకసారి సూర్యకాంతితో మీరు పరిపూర్ణమవుతారని.. కానీ చతుర్థి రోజు మాత్రం మిమ్మల్ని శిక్షించడాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారని వారికి చెప్పాడట. విఘ్నేషుడు ఇచ్చిన శాపం ప్రకారం.. భాద్రపద శుక్లపక్షం నాల్గో రోజున చంద్రుని ముఖాన్ని చూసిన వారెవరైనా నిందల పాలవుతారు.
శ్రీకృష్ణుడు కూడా కళంకితుడయ్యాడు.
వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు చంద్రుడిని చూశాడని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్లే అతనిపై దొంగతనం ఆరోపణలు చేశారట. అందుకే భాద్రపద శుక్లపక్షం చతుర్థిని 'కళంక చతుర్థి' అని కూడా అంటారు. అందుకే ఈ రోజు ఎవ్వరూ చంద్రుడిని చూడరు.
Ganesh Chaturthi 2023
వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి?
ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 18న, ఇతర క్యాలెండర్ల ప్రకారం సెప్టెంబర్ 19వ తేదీన జరుపుకోనున్నారు.
వినాయక చతుర్థి తిథి సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమవుతుంది.
వినాయక చవితి తిథి ముగింపు : సెప్టెంబర్ 19, 2023 మధ్యాహ్నం 01:43 గంటలకు