ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు
ganesh chaturthi 2023: వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత కొన్ని పనులను అసలే చేయకూడదు.
ganesh chaturthi 2022 44
ganesh chaturthi 2023: వినాయకుడి జనదినాన్నే వినాయక చతుర్థిగా జరుపుకుంటారు. దీన్నే వినాయక చవితి అని కూడా అంటారు. ఈ పండుగను పది రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మొదటి రోజు వినాయకుడిని కొందరు ఇంట్లో, ఇంకొందరు మండపాల్లో ప్రతిష్టించి పది రోజుల పాటు నిష్టగా పూజ చేస్తారు. అయితే 10 రోజుల పాటు సాగే ఈ పండుగకు ఎన్నో ఆచారాలను, నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత ఎలాంటి పనులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా వినాయకుడిని ఇంటికి తీసుకురావడం కంటే ముందే మీ ఇంటిని శుభ్రంచేయాలి. ముఖ్యంగా వినాయకుడిని ప్రతిష్టించే మందిరాన్ని అలంకరించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. నీటితో నిండిన కలశాన్ని పెట్టి దాని పైన కొబ్బరికాయను పెట్టాలి. దీన్ని పూలు, తమలపాకులు, కలవ తో అలంకరించాలి. ఆ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని ఒక వేదికపై ప్రతిష్టించాలి. గంధం, పూలు, దండ వంటి పవిత్ర దారంతో వినాయక విగ్రహాన్ని అలంకరించాలి
ఇకపోతే వినాయకుడికి 10 రోజుల పాటు పూజ మరువకుండాచేయాలి. అలాగే వినాయకుడికి లడ్డూ, మోదక్ లను సమర్పిస్తారు.
అయితే మీరు వినాయకుడిని 10 రోజులు ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. వినాయకుడిని 1.5 రోజులు, 3 రోజులు, 7 రోజులు లేదా 10 రోజులు ఇంట్లో ఉంచొచ్చు. లేదంటే ఈ తేదీల్లో నిమజ్జనం చేయొచ్చు. మరి గణపతి స్థాపన పూర్తయ్యాక కుటుంబ సభ్యులు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లి, వెల్లుల్లి
వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టిస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితిలో ఉల్లి, వెల్లుల్లిని అసలే తినకండి.
ఆహారం సమర్పన
వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించారు కాబట్టి మీరు చేసిన ఆహారాలన్నీ బొజ్జ గణపయ్యకు సమర్పించాలి. గణేశుడు ఇంట్లో అతిథి కాబట్టి ఆహారం, నీరు ఏదైనా సరే ముందుగా దేవుడికే నైవేద్యంగా పెట్టండి.
ఒంటరిగా వదిలేయకూడదు
మీ ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే.. విగ్రహాన్ని పట్టించుకోకుండా వదిలేయకూడదు. అంటే ఇంట్లో గణేషుడితో పాటుగా కనీసం ఒక కుటుంబ సభ్యుడైనా ఉండాలి.
జూదం ఆడవద్దు
విఘ్నేషుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంట్లో లేదా బయట జూదం ఆడకూడదు. ఇది అపవిత్రం. మీకు పుణ్యం కలగదు.
మాంసాహారం, ఆల్కహాల్ తినకూడదు
ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు కాబట్టి.. మీరు మాంసాహారాన్ని తినకూడదు. అలాగే మందును అసలే తాగకూడదు. ఇలా చేస్తే విఘ్నేశుడికి కోపం వస్తుంది.
పాజిటివ్ గా ఆలోచించండి
నెగెటివ్ గా ఆలోచిస్తే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తది. ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మీరు అసభ్య పదజాలాన్ని వాడకూడదు.
బ్రహ్మచర్యం పాటించండి
వినాయక చవితికి మీ ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తే మీరు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి.