బొజ్జ గణపయ్య కలలో కనిపిస్తే ఏమర్థమో తెలుసా?
Ganesh Chaturthi 2023: అది చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటి శుభకార్యానికైనా వినాయకుడినే ముందుగా పూజిస్తాం. ఎందుకంటే విఘ్నేషుడి ఆశీస్సులు మనపై ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అయితే వినాయకుడు కలలో కనిపిస్తే శుభ సంకేతంగా భావిస్తారు. అలాగే..
ganesh chaturthi 2023
Ganesh Chaturthi 2023: వినాయక చవితిని కొన్ని చోట్లా సెప్టెంబర్ 18 న జరుపుకుంటే ఇంకొన్ని చోట్ల సెప్టెంబర్ 19 న జరుపుకున్నారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయకుడిని మీరు కలలో చూసినట్టైతే.. మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇచ్చినట్టేనంటున్నారు పండితులు. మరి వినాయకుడు కలలో కనిపిస్తే ఏం అర్థమొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
lord ganesha 001
వినాయకుడు ఎలుకపై స్వారీ చేయడం చూస్తే..
మీ కలలో విఘ్నేషుడు తన వాహనమైన ఎలుకపై స్వారీ చేస్తూ కనిపించాడా? కలల శాస్త్రం ప్రకారం.. ఇదెంతో పవిత్రమైనది. ఇలాంటి కల మీకు పడితే అతి త్వరలోనే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. మీకు డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదు.
బ్రహ్మ ముహూర్తంలో ఈ కల వస్తే..
హిందూ మతంలో.. బ్రహ్మ ముహూర్తాన్ని హిందూ ఎంతో పవిత్రమైన సమయంగా భావిస్తారు. మీకు బ్రహ్మముహూర్తంలో వినాయకుడు కలలో కనిపిస్తే.. వినాయకుడు మీతో సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి కల కంటే మీకు కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయని అర్థం.
ఈ కల శుభప్రదం
వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని.. మీరు మీ కలలో లంబోధరుడిని పూజిస్తే మీకు అదృష్టం కలుగుతుంది. అంటే అతి త్వరలోనే మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయన్న మాట. వినాయకుని ఆశీస్సులతో మీరు మీ కష్టాలన్నింటి నుంచి బయటపడతారు.