వినాయకుడిని ఈ శుభ ముహూర్తంలోనే నిమజ్జనం చేయండి
Ganesh Chaturthi 2023: 2023 దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను పది రోజుల పాటు జరుపుకుంటాం. అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనంతో ఈ పండుగ ముగుస్తుంది. అయితే వినాయకుడిని శుభ సమయంలో నిమజ్జనం చేస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Ganesh Chaturthi 2023: హిందూ మతంలో వినాయకుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి పండును 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయకుడిని పూజించడం వల్ల మనకున్న అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే వినాయకుడిని వినాయక చవితి పదో రోజున అంటే అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం రోజున వినాయకుడు తిరిగి తన ఇంటికి వెళతాడని నమ్ముతారు. అందుకే వినాయకుడిని ఈ సమయంలో సంతోషంగా సాగనంపాలి.
గణపతి నిమజ్జనం శుభ సమయం
ఈ ఏడాది సెప్టెంబర్ 28 అంటే గురువారం నాడు వినాయక నిమజ్జనం జరుగనుంది. అయితే కొంతమంది పది రోజుల కంటే ముందే అంటే గణపతిని ఒకటిన్నర, మూడు, ఐదు, ఏడో రోజున కూడా నిమజ్జనం చేస్తుంటారు. అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి శుభ సమయమేందో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
1. సెప్టెంబర్ 21 న సాయంత్రం 06:21 గంటల నుంచి 09:19 గంటల వరకు మంచి ముహూర్తం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం ముహూర్తం సాయంత్రం 04.50 నుంచి 06.21 వరకు ఉంటుంది.
2. ఐదో రోజు - సెప్టెంబర్ 23 న అంటే శనివారం మధ్యాహ్నం 12.15 నుంచి 04.48 వరకు శుభ ముహూర్తం ఉంది. అలాగే ఈ రోజు సాయంత్రం శుభ ముహూర్తం 06:19 నుంచి 07:48 వరకు ఉంటుంది.
Image: Getty Images
3. ఏడో రోజు - సెప్టెంబర్ 25 అంటే సోమవారం నాడు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మధ్యాహ్నం 01:44 నుంచి 06:16 వరకు శుభ ముహూర్తం ఉంటుంది. అలాగే సాయంత్రం 06.16 నుంచి 07.45 గంటల వరకు శుభ ముహూర్తం ఉంటుంది.
4. అనంత చతుర్దశి శుభ ముహూర్తం - సెప్టెంబర్ 28 న అంటే గురువారం ఉదయం 06:11 నుంచి 07:40 గంటల వరకు శుభ ముహూర్తం ఉంటుంది. అలాగే సాయంత్రం 04:41 గంటల నుంచి రాత్రి 09:10 గంటల వరకు వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు.
నిమజ్జన పూజా విధి
గణపతి నిమజ్జనానికి ముందు వినాయకుడిని ఆచారాలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. నిమజ్జనానికి ముందు పూజ సమయంలో వినాయకుడికి ఎర్రచందనం, ఎర్రని పూలు, దుర్వ, మోదకాలు, తమలపాకు, ధూపం-దీపం మొదలైనవి సమర్పించాలి. అలాగే కుటుంబం అంతా కలిసి గణపయ్యకు హారతిని ఇవ్వాలి. నిమజ్జనానికి ముందు వినాయకుడి చేతిలో లడ్డును పెట్టండి.