వినాయక చవితి 2023: వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ నియమాలను పాటించలేదో..!
Ganesh Chaturthi 2023: వినాయక చవితి పండుగను పది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పది రోజులు విఘ్నేషుడికి పూజలు చేసి.. రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే వారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Ganesh Chaturthi 2023: వినాయక చవితి పండును దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితిని కొన్ని ప్లేస్ లల్లో సెప్టెబర్ 18 న జరుపుకుంటే మరికొన్ని ప్రదేశాల్లో సెప్టెంబర్ 19 న జరుపుకోనున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో జరుపుకోనున్నారు. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక చతుర్థి పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లోనే కాకుండా ఇంట్లో కూడా ప్రతిష్టిస్తుంటారు. ఇలా ఇళ్లలో విగ్రహాలను పెట్టేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే..
వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చే ముందు మీ ఇంటిని శుభ్రం చేయాలి. అలాగే పూలతో అలంకరించాలి.
మట్టి వినాయక విగ్రహాన్నే కొనండి. లేదా చెక్క, ఇనుము, ఆవుపేడ, పసుపుతో తయారుచేసిన ఎకో ఫ్రెండ్లీ బొజ్జ గణపయ్య విగ్రహాలను కొనండి.
గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకొచ్చే ముందు విగ్రహాన్ని శుభ్రమైన గుడ్డతో నిండుగా కప్పండి.
మీ ఇంట్లో పూజ గదిలో విగ్రహాన్ని పెట్టాలనుకుంటే ముందుగా పూజ గదిని శుభ్రం చేయండి. అలాగే పూలతో అలంకరించడండి. అలాగే నీటితో నింపిన కలశాన్ని పెట్టండి.
అలాగే నినాయకుడిని ప్రతిష్టించడానికి ఆసనాన్ని కూడా ఏర్పాటు చేయండి.
పూజ గదిలో విగ్రహాన్ని ప్రతిష్టించిన తరవ్ాత వినాయకుడిని తాజా పువ్వులతో అలంకరించండి. అలాగే విఘ్నేషుడి ఎడమ భుజంపై జన్వే అని పవిత్రమైన దారాన్ని అలంకరించండి.
పూజ చేసేటప్పుడు వినాయకుడి పవిత్రమైన మంత్రాలను పఠించండి. ఇలాగే ప్రతిరోజూ పూజ చేయాలి. నైవేద్యాలను సమర్పించాలి
lord ganesha 0001
వినాయక చవితికి చేయకూడని పనులు
వినాయకుడిని ప్రతిష్టించిన వారు పది రోజుల పాటు ఆల్కహాల్ ను తాగకూడదు. మాంసాన్ని తినకూడదు.
అలాగే మీ ఇంట్లో వినాయక విగ్రహం ఉన్నంత వరకు స్మోకింగ్ అసలే చేయకూడదు.
మీరు తినే వంటల్లో ఉల్లిపాయ, వెల్లులిని వేయకూడదు.
వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉన్నంత వరకు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. జ్యోతిష్యుల ప్రకారం.. వినాయకుడిని ఇంట్లో ఒంటరిగా ఉంచకూడదు.
అలాగే వినాయకుడి విగ్రహాలను ఇంట్లోకి శుభ సమయంలోనే తీసుకురావాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.