గణేష్ చతుర్థి 2022: గణపయ్యకే తొలి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..?
గణేష్ చతుర్థి 2022: ప్రతి ఏడాది వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అయితే ప్రతి పండుగ, శుభకార్యాలకు వినాయకుడే తొలి పూజలను ఎందుకు అందుకుంటారు.. దీన్ని ఎవరు ప్రారంభించారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి..
వినాయక చవితి పండుగ కోసం పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన మొదటి రోజు నుంచి నిమజ్జనం వరకు వినాయకుడిని నిష్టగా పూజిస్తారు. అంతేకాదండోయ్ ప్రతి గల్లీ.. సందూ వినాయకుడి మండపాలు.. బొజ్జ గణపయ్య పాటలతో మార్మోగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి ఉత్సవాలు అంబరాన్నంటుతాయి.
Image: Getty Images
ఇక ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31 తారీఖున వచ్చింది. ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో వస్తుంది. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి పండుగను ఎవరు స్టార్ట్ చేశారు. వినాయకుడే తొలిపూజలను ఎందుకు అందుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image: Getty Images
విఘ్నాలు తొలగించే భగవంతుడు
పురాణాల ప్రకారం.. రాక్షసుల వల్ల కలిగే బాధలను, కష్టాలను తొలగించేందుకు వినాయకుడిని పుట్టించమని దేవతలందరూ శివ పార్వతులను వేడుకుంటారు. దేవతల కోరికమేరకు పార్వతీ పరమేశ్వరులు విఘ్నేషుడిని పుట్టిస్తారు. విఘ్నాలు అంటే బాధలు.. హర్తా అంటే తొలగించేవాడని అర్థం. అందుకే విఘ్నాలను తొలగించే వినాయకుడినే మొదటిగా పూజించాలని పురాణాలు తెలియజేస్తున్నాయి. వినాయకుడికి ఒక్క దేవతలే కాదు.. మనుషులు కూడా మొదటి పూజలు నిర్వహిస్తారు.
Image: Getty Images
వినాయకుడికి మొదటి పూజ చేయడం వల్ల కుటుంబంలోని కలహాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు వ్యక్తిగతమైన సమస్యలు కూడా తొలగిపోతాయట. మీకు తెలుసా..? బ్రహ్మదేవుడు కూడా మొదటగా వినాయకుడినే పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
Image: Getty Images
చరిత్రపరంగా చూస్తే ఛత్రపతి శివాజీ నే వినాయక చవితి పండుగను మొదటగా ప్రారంభించారని స్పష్టం అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే గణేష్ ఉత్సవాలు మహారాష్ట్రలో ఇంకా ఘనంగా జరుగుతాయి. మరో కథనం ప్రకారం.. బాల గంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగను మొదటి సారిగా పశ్చిమ బెంగాల్ లో నిర్వహించారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.
అయితే ఈ వినాయక చవితి ఉత్సవాలను మొదట మూడు రోజుల పాటే చేసేవారట. ఆ తర్వాత ఐదు రోజులకు.. ఆ తర్వాత 9 రోజులకు పెంచుకుంటూ వచ్చారట. అయితే కొంతమంది ఈ రోజుల్లో ఏ నాడైనా వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. వినాయకుడి నిమజ్జనం తర్వాత బొజ్జ గణపయ్య కైలాసంలో ఉండే తల్లిదండ్రులు శివ పార్వతుల దగ్గరకు వెళతాడట.