Ganesh Chaturthi 2022: వినాయక చవితి రోజు మీ ఇంట్లోకి ఈ వస్తువులను తెస్తే.. లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు..
Ganesh Chaturthi 2022: విఘ్నాలను తొలగించే వినాయకుడి అనుగ్రహం పొందాలంటే..ఆయన్ను నిష్టగా పూజించి.. ఇష్టమైన నైవేధ్యాలను సమర్పిస్తే చాలు. అయితే మీ ఇంట్లో లక్ష్మీ దేవి కొలువుదీరాలంటే వినాయక చవితి రోజూ ఈ ఐదు వస్తువులను ఇంట్లోకి తేవాలని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు.
ganesh chaturthi 2022
Ganesh Chaturthi 2022: ఈ నెల 31న అంటే బుధవారం నాడు వినాయక చవితిని జరుపుకోబోతున్నాం. ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైంది. అయితే వినాయక చవితినాడు ఇంటికి కొన్ని వస్తులను తీసుకొస్తే అంతా శుభమే కలుగుతుందట. ముఖ్యంగా లక్ష్మీ దేవి కటాక్షం పొందుతారట. దీంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. ఆదాయం బాగా పెరుగుతుందట. మరి ఇందుకోసం వినాయక చవితి నాడు ఇంట్లోకి ఏయే వస్తువులు తేవాలో తెలుసుకుందాం పదండి.
శంఖం
శంఖంలోనే లక్ష్మీదేవి నివసిస్తుందట. ఈ వినాయక చవితి నాడు ఇంట్లో శంఖాన్ని పెడితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట. అంతేకాదు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వినాయకుడికి హారతి ఇచ్చిన తర్వాత శంఖాన్ని ఊదడం వల్ల పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది.
వేణువు
వినాయక చవితి రోజున ఇంట్లోకి వేణువును తీసుకొస్తే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందట. దీంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.
కొబ్బరి కాయ
మత విశ్వాసాల ప్రకారం.. గణేష్ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరి కాయను తేవడం వల్ల ఇంట్లో డబ్బుకు ఏ కొరతా ఉండదు. అయితే ఇంటికి తెచ్చిన తర్వాత ఈ కొబ్బరి కాయకు పూజ చేయాలి. ఇది ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది.
kubera
కుబేరుడి విగ్రహం
కుబేరుడి దగ్గర ఎన్నటికీ తరగని సంపద ఉంటుంది. అందుకే ఈయన్ని సంపదకు అధిపతి అంటారు. అయితే వినాయక చతుర్థి నాడు ఇంట్లో కుబేరుడి విగ్రహాన్ని పెట్టాలట. దీనివల్ల లక్ష్మీ దేవి మిమ్మల్ని వరిస్తుంది. దీంతో మీ పేదరికం తొలగిపోతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఉత్తరాన పెట్టడం శుభప్రదం.
ganesh chaturthi 2022
నాట్యం చేస్తున్న భంగిమలో ఉన్న వినాయకుడు
కొందరి విశ్వాసం ప్రకారం.. నాట్యం చేస్తున్న భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ గణపతి విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావని చాలా మంది విశ్వసిస్తారు.