దసరా రోజు పాలపిట్టను చూడటం ఎందుకు మంచిదంటరు? దీని వెనుకున్న కథేంటి?
dussehra 2023: విజయదశమి నాడే శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతీ ఏడాది అశ్విని మాసం శుక్లపక్షం పదో రోజున దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజు రాక్షస రాజు రావణుడి దిష్టి బొమ్మను తయారుచేసి దహనం చేస్తారు. అలాగే ఈ రోజు రాముడిని పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు పాలపిట్టను చూడటం శుభప్రదంగా భావిస్తారు.
Dussehra 2023 beliefs
సనాతన ధర్మంలో విజయదశమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజే శ్రీరాముడు రావణుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్ల పక్షం పదవ రోజున దసరా పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజు రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తారు. అలాగే శ్రీరాముడిని పూజిస్తారు. అయితే ఈ పండుగ రోజు పాలపిట్టను చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. అసలు దీనివెనుకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Dussehra 2023 beliefs
సనాతన గ్రంథాల ప్రకారం.. త్రేతాయుగంలో.. దసరా రోజున రావణుడిని సంహరించడానికి ముందు రాముడు జమ్మి చెట్టును పూజించాడు. అలాగే ఆ ఆకులను తాకాడు. ఇదే సమయంలో రాముడికి పాలపిట్ట కూడా కనిపించింది. ఆ తర్వాతే రాముడు రావణుడిని సంహరించాడు. అందుకే దసరా రోజున పాలపిట్ట చూడటం శుభప్రదంగా భావిస్తారు. దీని చూడటం వల్ల అనుకున్న పనులు సజావుగా సాగుతాయని నమ్ముతారు.
Dussehra 2023 beliefs
అయితే రావణుడిని చంపినందుకు గాను బ్రాహ్మణులను చంపిన పాపం రాముడికి ఉంటుంది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముడు దేవతల దేవుడైన శివుడి కోసం కఠిన తపస్సు చేస్తాడు. దీంతో శివుడు శ్రీరాముడికి నీలకంఠ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్ల పక్షం పదవ రోజున అంటే దసరా రోజున పాలపిట్ట పక్షిని చూడటం పవిత్రంగా భావిస్తారు. పాలపిట్టను చూడటం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయని నమ్ముతారు.