సోమవారం ఈ పరిహారాలు చేస్తే మీ బాధలన్నీ తొలగిపోయి.. సుఖసంతోషాలు పెరుగుతాయి
శివుడు ఎంతో దయగల దేవుడు. తన భక్తుల దుఃఖాలన్నిటినీ పోగొడుతాడు. ఆయన అనుగ్రహంతో భక్తులు రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. మహాదేవున్ని ఆరాధించే వారి జీవితంలో అన్ని రకాల సుఖసంతోషాలు పొందుతారని శివ పురాణంలో ఉంది. అందుకే సోమవారం నాడు శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
సోమవారం రోజున దేవతల దేవుడైన పరమేశ్వరుడిని పూజిస్తారు. ఈ రోజు ఆయనకు అంకితం చేయబడింది. ఈ రోజున శివుడితో పాటుగా పార్వతీ దేవిని పూజిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. వీరిని నిష్టగా పూజిస్తే జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. శివుడు తన అనుగ్రహంతో భక్తులను రక్షిస్తాడని నమ్మకం. మహాదేవున్ని ఆరాధిస్తే వారి జీవితంలో అన్ని రకాల సుఖసంతోషాలను పొందుతారని శివ పురాణంలో ఉంది. అందుకే శివుని భక్తులు సోమవారం శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. జ్యోతిషశాస్త్రంలో సోమవారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే నిబంధన కూడా ఉంది. ఈ చర్యల ద్వారా మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే సుఖసంతోషాలు పెరుగుతాయి. అవేంటంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ కుటుంబంలో ఎప్పుడూ కొట్లాటలు, గొడవలు, కలహాలు ఉంటే సోమవారం రోజున ఉదయం స్నానం చేసి ధ్యానం చేయండి. ఆ తర్వాత శివుడిని నిష్టగా పూజించండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న రోజ్ వుడ్ చెట్టు దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించండి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి.
మీ జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటే సోమవారం రోజు శివుడితో పాటు సరస్వతీ దేవిని కూడా పూజించండి. దీనివల్ల మీ మెమోరీ పవర్ పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో సరస్వతీదేవికి పాలు, బియ్యంతో చేసిన ఖీర్ సమర్పించండి. సరస్వతీ మాతకు కుంకుమపువ్వు కలిగిన ఖీర్ ను కూడా సమర్పించొచ్చు. అలాగే స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించి 'ఓం సరస్వతీ నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
పెళ్లికానికి వారు సోమవారం రోజు స్నానం చేసి ధ్యానం చేసి తెల్లని దుస్తులు ధరించాలి. తర్వాత నీళ్లలో పాలు పోసి శివునికి అభిషేకం చేయాలి. రాహు-కేతువుతో సహా అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించడానికి మీరు నల్ల నువ్వులను నీటిలో కలపొచ్చు. దేవుడికోసం తెచ్చిన తెల్లని బట్టలను దేవుడికి సమర్పించండి. శివుని ప్రసన్నం చేసుకోవడానికి భాంగ్, ధతుర, మదార పూలు మొదలైన వాటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.
మీ వైవాహిక జీవితం సంతోషంగా లేకపోతే సోమవారం శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం 'ఓం నమః శివాయ'తో పాటు 'ఓం బ్రహ్మ్ భృన్ స: రహవే నమః' అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల బంధం ఆనందంగా, మధురంగా, దృఢంగా మారుతుంది.
మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రతి సోమవారం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు దృఢంగా మారతాడు. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.