సోమవారం ఈ పరిహారాలు చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో పేదరికం పోతుంది.. మీ కోరికలన్నీ నెరవేరుతాయి
సోమవారం నాడు మహాదేవుడిని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కూడా కలుగుతాయి.
సోమవారం దేవతల దేవుడైన పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజు శివుడితో పాటుగా పార్వతీమాతను కూడా పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు. సోమవారం నాడు నిష్టగా ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే సౌభాగ్యం కలుగుతుంది.
అయితే జ్యోతిషశాస్త్రంలో సోమవారం నాడు కొన్ని పరిహారాలు చేయాలనే నిబంధన కూడా ఉంది. ఈ పరిహారాలను చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు, దుఃఖాలు పోతాయి. కోపం మటుమాయం అవుతుంది. మరి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆటంకాలు తొలగుతాయి
జీవితంలో ఇబ్బందులు లేని వారు ఉండరు. మీరు ఏ విధమైన కష్టాన్ని ఎదుర్కొంటున్నా.. సోమవారం నాడు శివుడిని ఖచ్చితంగా పూజించండి. అలాగే పూజా సమయంలో పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. ప్రతి సోమవారం నాడు ఇలా తప్పకుండా చేయండి. దీని వల్ల మీ జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ఆదాయం, అదృష్టం పెరుగుతాయి
ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు కూడా చాలా మందే ఉంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడితే సోమవారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. అలాగే గంగా నీటిలో బార్లీని కలిపి శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయి. అలాగే మీ తండ్రుల ఆశీస్సులను కూడా పొందుతారు. ప్రతి సోమవారం ఇలా చేయొచ్చు.
రుణం నుంచి ఉపశమనం
మీరు చాలా కాలంగా అప్పుల బాధతో సతమతమవుతున్నారా? మీరు మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి.. ప్రతి సోమవారం నాడు గంగాజలంతో శివుడికి అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్త్రాలను పరమేశ్వరుడికి సమర్పించండి. ఈ పరిహారాలన్నింటినీ చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు.