MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • అమావాస్య రోజు పొరపాటున కూడా ఇలా చెయ్యకండి... చేశారంటే దరిద్రం పట్టిపీడిస్తుందట!

అమావాస్య రోజు పొరపాటున కూడా ఇలా చెయ్యకండి... చేశారంటే దరిద్రం పట్టిపీడిస్తుందట!

అమావాస్య (Amavasya) రోజు చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తుంది. మరి అమావాస్య రోజు చేయకూడని పనులు (Things not to do) ఏంటో తెలుసుకుందాం.. 

2 Min read
Navya G | Asianet News
Published : Feb 01 2022, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితానికి శుభ ఫలితాలను (Good results) కలిగిస్తాయి. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభఫలితాలను పొందగలుగుతారు. అమావాస్య రోజు సూర్యోదయం (Sunrise) అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది.
 

26

కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు తల స్నానం (Head bath) చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తల స్నానం చేయడం మంచిది. అమావాస్య రోజు తల స్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను (New clothes) ధరించరాదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది.
 

36

కనుక అమావాస్య మధ్యాహ్నం (Afternoon) ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు రాత్రి భోజనం (Meal) చేయుట కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది.
 

46

కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలి పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం (Hair cutting), గోళ్ళు కత్తిరించడం (Trimming nails) చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం 5-6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది.
 

56

అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈరోజు పితృదేవతలను (Ancestral gods) నమస్కరించుకుని వారి అనుగ్రహం (Grace) పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర ప్రకారము ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు.
 

66

అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే దరిద్ర దేవత అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం (Lakshmidevi grace) కలిగి అదృష్టం వరిస్తుంది (Good luck). శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభఫలితాలను పొందగలుగుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
Recommended image2
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Recommended image3
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved