మంగళవారం నాడు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తది
సనాతన ధర్మంలో మంగళవారం హనుమంతుని పూజకు అంకితం చేయబడింది. హనుమంతుని అనుగ్రహం పొందితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు. అందుకే ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని నిష్టగా పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం మంగళవారం నాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.
హిందూ మతంలో.. ప్రతిరోజూ ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. కాగా మంగళవారం హనుమంతుని పూజలు అంకితం చేయబడింది. మత విశ్వాసాల ప్రకారం.. మంగళవారం నాడు హనుమయ్యను పూజించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మంగళవారు నాడు కొన్ని రకాల పనులను చేస్తే జీవితంలో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు అంటున్నారు. అవేంటంటే?
ఈ పని చేయొద్దు
మత విశ్వాసాల ప్రకారం.. మంగళవారం నాడు పొరపాటున కూడా గోర్లను, జుట్టును అస్సలు కట్ చేయకూడదు. ఇది శుభప్రదంగా పరిగణించబడదు. ఇలా చేయడం వల్ల హనుమంతుడికి కోపం వస్తుందట. దీని వల్ల మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. అందుకే మంగళవారం నాడు జుట్టును, గోర్లును కట్ చేయడం, షేవింగ్ చేయడం మానుకోండి.
వీటిని తినకూడదు
పండితుల ప్రకారం.. మంగళవారం నాడు ఆల్కహాల్ ను తాగకూడదు. మాంసాన్ని తినకూడదు. ఈ రోజు వీటికి దూరంగా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు మంగళవారం నాడు వీటిని తింటే హనుమంతుని ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని కొందరు పండితులు చెబుతున్నారు.
ఉపవాసం సమయంలో..
ప్రతి మంగళవారం హనుమంతుని కోసం ఉపవాసం ఉంటున్నట్టైతే ఈ సమయంలో మీరు ఉప్పును తినకూడదు. ఒకవేళ ఉప్పును తీసుకుంటే మీరు ఉపవాసం ఫలితాన్ని పొందరు. ఉప్పు ఉపవాసాన్ని భంగం చేస్తుంది. అందుకే ఉపవాసం ఉండేవారు ఉప్పుకు దూరంగా ఉండాలి.
అప్పు ఇవ్వొద్దు..
అవును మంగళవారం నాడు రుణం రూపంలో డబ్బులు ఇవ్వకూడదని కూడా పండితులు చెబుతున్నారు. నమ్మకాల ప్రకారం.. ఈ రోజు ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది. అలాగే మంగళవారం నాడు పర్యటనకు వెళ్లడం కూడా మంచిది కాదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా ట్రిప్ కు వెళ్లాల్సి వస్తే బెల్లం తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.