దీపావళికి లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను కొందామనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.. లేదంటే?
diwali 2023: ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాం. ఈ పండుగను కేవలం ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 12 న అంటే ఆదివారం నాడు వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు.
diwali 2023: హిందువులకు ఎంతో ముఖ్యమైన, పవిత్రమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపాలతో జరుపుకునే ఈ పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. దీపావళి రోజు ఇంట్లో, దేవాలయాల్లో, పని ప్రదేశాల్లో దీపాలను వెలిగిస్తారు.
ఈ ప్రత్యేకమైన దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి, విఘ్నేషులను నిష్టగా పూజిస్తారు. అందుకే ఆ రోజు లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను చాలా మంది కొంటుంటారు. అయితే ఈ విగ్రహాలను కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వివిధ రకాల విగ్రహాల కొనుగోలు
దీపావళి నాడు లక్ష్మీదూవి, వినాయక పూజ కోసం లక్ష్మీ దేవి, వినాయకుడి కొత్త విగ్రహాలను కొంటుంటారు.ఈ సమయంలో లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. అంతేకానీ ఈ విగ్రహాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టకూడదంటున్నారు పండితులు.
వినాయక విగ్రహం
దీపావళికి విఘ్నేషుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొనే వినాయక విగ్రహానికి తొండం ఎడమవైనకు ఉండాలని గుర్తుంచుకోండి. అలాగే వినాయకుడు ఎలుకపై ప్రయాణిస్తూ.. చేతిలో మోదకం ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని దీపావళికి కొంటే మీరు ప్రత్యేక ఫలితాలను పొందుతారు.
లక్ష్మీ దేవి విగ్రహం
ఈ దీపావళికి మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనాలనుకుంటే .. దేవత తన వాహనమైన గుడ్లగూబపై స్వారీ చేయకుండా ఉన్న విగ్రహాన్నే కొనండి. అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్న విగ్రహాన్ని అస్సలు కొనకండి. ఎందుకంటే ఇలాంటి విగ్రహం లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోవడాన్ని సూచిస్తుంది. అందుకే దేవత కమలంపై కూర్చుని ఉన్న విగ్రహాన్ని కొనండి. ఎందుకంటే ఇలాంటి విగ్రహం కుటుంబానికి పవిత్రమైనదిగా భావిస్తారు.