దీపావళి 2023: దీపావళి రోజున ఇంట్లోకి బల్లులు రావడం శుభమా? అశుభమా?
Diwali 2023: సనాతన ధర్మంలో దీపావళి ఎంతో ముఖ్యమైన, పవిత్రమైన పండుగ. ఈ రోజు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారు. అయితే ఈ రోజున ఇంట్లో బల్లులు కనిపించడం శుభమా? అశుభా అన్న అనుమానాలు చాలా మందికి వస్తుంటాయి. మరి దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?
దీపావళికి ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను శుభ్రం చేస్తుంటారు. ఏ ఒక్క మూలనూ విడిచిపెట్టకుండా క్లీన్ చేస్తుంటాయి. అయితే చాలా మంది ఇండ్లలో బల్లులు ఖచ్చితంగా ఉంటాయి. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు వీటిని కూడా ఇంట్లో నుంచి తరిమికొడతారు. బల్లులు మీద పడకూడదని వీటిని ఇంట్లో ఉండకుండా చేసేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. బల్లులు ఇంట్లో ఉండటం శుభప్రదం. మరి దీపావళి నాడు బల్లులను చూడటం వల్ల ఏమౌంతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపావళి రోజున బల్లుల దర్శనం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. దీపావళి పండుగ రోజు మీకు మీ ఇంట్లో బల్లి కనిపించినట్టైతే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. ఎందుకంటే బల్లిని లక్ష్మేదేవికి చిహ్నంగా కూడా భావిస్తారు. కాబట్టి దీపావళి నాడు బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టకండి.
ఇంటి గుడిలో బల్లి దర్శనం..
ఇంటి గుడిలో కూడా అప్పుడప్పుడు బల్లులు కనిపిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం.. మన ఇండి గుడిలో బల్లులు కనిపించడం ఎంతో పవిత్రం. అంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే మీ ఇళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని కూడా అర్థం. కాబట్టి ఇంటి గుడిలో బల్లి కనిపిస్తే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పూజ సమయంలో బల్లి కనిపించడం..
దీపావళి రోజున మీరు లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు బల్లి కనిపించిందని ఏం జరుగుతుందోనని పెద్దగా భయపడకండి. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి నుంచి మంచి శుభ సంకేతమంటున్నారు జ్యోతిష్యులు. అందుకే పూజా సమయంలో మీకు బల్లి కనిపిస్తే సంతోషించండి. అలాగే అమ్మవారిని మీ కోరికలను తీర్చమని ప్రార్థించండి.
Lizard at home
తలపై బల్లి పడితే..
అనుకోకుండా బల్లులు తలపై కూడా పడుతుంటాయి. వామ్మో ఏమౌతుందోనని చాలా మంది తెగ భయపడిపోతుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి ఆపద రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మత విశ్వాసాల ప్రకారం.. తలపై బల్లి పడటం పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున మీ తలపై బల్లి పడితే మీకు రాజయోగం కలబోతుందని సంకేతం. ఒకవేళ మీకు దీపావళి నాడు బల్లి తలమీద పడితే తలస్నానం చేసి దేవాలయానికి వెళ్లి దానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.