దీపావళి షాపింగ్ చేద్దామనుకుంటున్నారా? శుభ సమయం ఇదే..! ఈ రోజుల్లో షాపింగ్ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు
diwali 2023: దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే భక్తుల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని నిష్టగా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటుగా భక్తుల బాధలను పోగొట్టే వినాయకుడిని కూడా పూజిస్తారు. అయితే దీపావళికి షాపింగ్ చేయాలనుకువారికి రెండు రోజులు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రెండు రోజులు షాపింగ్ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారట. అలాగే ఆర్థిక సమస్యలొచ్చే అవకాశం కూడా తగ్గుతుందట.
shopping
దీపాల పండుగ అయిన దీపావళిని ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపకుంటాం. దీని ప్రకారం దీపావళి పండుగను నవంబర్ 12 న జరుపుకోనున్నాం. సుఖసంతోషాలు ప్రసాదించే లక్ష్మీదేవిని, విఘ్నేషుడుని ఈ పండుగ రోజు పూజిస్తారు. పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు వినాయకుడిని పూజించే ఆచారం కూడా ఉంది. ఈ దేవుళ్లను పూజిస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. అయితే చాలా మంది ధనత్రయోదశి, దీపావళికి షాపింగ్ చేస్తుంటారు. ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 10న వచ్చింది. దీపావళికి ముందు చాలా అరుదైన ముహూర్తం రావడం షాపింగ్ కు యాదృచ్చికంగా మారుతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగంలో షాపింగ్ చేయడం వల్ల భక్తులు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతాట. మరి ఆ ముహూర్తం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ సమయం
పంచాంగం ప్రకారం.. కార్తీక మాసంలోని అమావాస్య తిథి నవంబర్ 12 మధ్యాహ్నం 02:44 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఇది నవంబర్ 13 మధ్యాహ్నం 02:56 గంటలకు ముగుస్తుంది.
శుభ ముహూర్తం
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. దీపావళి పండుగకు ముందు అంటే.. కార్తీక మాసంలోని కృష్ణపక్షం అష్టమి తొమ్మిదో రోజున షాపింగ్ చేయొచ్చు. ఈ రోజు షాపింగ్ కు శుభసమయం అంటున్నారు జ్యోతిష్యులు. ఈ రోజు పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ అత్యంత అరుదైన ముహూర్తంలో షాపింగ్ చేయడం వల్ల అక్షయ ఫలాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నా. పుష్య నక్షత్రం షాపింగ్ కు ఉత్తమమైనదిగా భావిస్తారు.
పుష్య నక్షత్రం తేదీ
పంచాంగం ప్రకారం.. కార్తీక మాసంలోని కృష్ణ పక్షం ఏడో రోజున ఉదయం 07:57 గంటలకు పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 5 న ఉదయం 10:29 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు దీపావళి షాపింగ్ చేయొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే నవంబర్ 04, 05 తేదీల్లో షాపింగ్ చేయొచ్చంటున్నారు జ్యోతిష్యులు.
సర్వార్థ సిద్ధి యోగం
కార్తీక మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడనుంది. ఈ యోగం ఉదయం 06.36 గంటల నుంచి 10.29 గంటల వరకు జరుగుతుంది. ఈ యోగంలో ఎలాంటి శుభకార్యాలనైనా చేయొచ్చు. అన్ని సజావుగా సాగుతాయి.