ధనత్రయోదశి సందర్భంగా ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ పోయి.. సిరిసంపదలు కలుగుతాయి
Dhanteras 2023: ధనత్రయోదశి పండుగతో పాటుగా దీపావళి పండుగ కూడా మొదలవుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం, వెండితో చేసిన వస్తువులను కొనడం వల్ల లక్ష్మేదేవి అనుగ్రహం మీపై ఏడాది పొడవునా ఉంటుదని నమ్ముతారు. అలాగే ఈ రోజున కొన్ని పనులను చేస్తే మీ కష్టాలన్నీ తొలిగిపోయి, మీ ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు.
Dhanteras 2023: హిందూ మతంలో.. ధనత్రయోదశి పూజలు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను కార్తీక మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి రోజున జరుపుకుంటారు. ధనత్రయోదశి పండుగను సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మీరు కొన్ని పనులను చేస్తే మీకు పూజా ఫలితం దక్కుతుంది.
dhanteras
13 దీపాలు
ధనత్రయోదశికి 13వ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ రోజున మీరు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన చేతులతో 13 నెయ్యి, నూనె దీపాలను వెలిగించండి. ఈ దీపాలను మీ ఇంట్లో, బయట వాకిట్లో వెలిగించొచ్చు. ఇలా దీపాలను వెలిగించడం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే రోగాల భయం కూడా పూర్తిగా తొలగిపోతుంది.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి
ధన త్రయోదశి నాడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మీరు ఈ పనులను చేయండి. ధనత్రయోదశి నాడు బంగారం, వెండి ఆభరణాలు లేదా నాణేలు కొనడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ధనత్రయోదశి నాడు కొత్త వెండి నాణెం, కొన్ని పాత సాధారణ నాణేలను తీసుకొని వాటికి పసుపు పూయండి. ఆ తర్వాత ఈ నాణేలను సంపద దేవత అయిన లక్ష్మీదేవికి సమర్పించండి.
దీపం వెలిగించండి
ధనత్రయోదశి నాడు సాయంత్రం పూట ఏకశిలా దీపాన్ని వెలిగించండి. దీనిని దీపావళి రాత్రి వరకు వెలిగేలా చూసుకోండి. దీనివల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో సుఖసంతోషాలు కూడా నెలకొంటాయి. మీ సంపద పెరుగుతుంది.