ఏకముఖ రుద్రాక్ష ధరిస్తే ఏమౌతుందో తెలుసా?
ఏక ముఖ రుద్రాక్షను కరెక్ట్ గా ధరించిన వ్యక్తి కి.. ఆ శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయట
రుద్రాక్షలన్నింటిలోనూ... ఏకముఖ రుద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. పురాతన కాలం నంచి.. రుద్రాక్షను శివుడికి మరో రూపంగా భావిస్తారు. సాక్షాత్తు ఆ మహాశివుడే ఏకముఖ రుద్రాక్ష రూపంలోకి మారాడు అని నమ్ముతారు. మరి.. అంతంటి శక్తివంతమైన ఈ ఏకముఖి రుద్రాక్షను మనం ధరించడం వల్ల.. మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి చూద్దాం...
Ekmukhi Rudraksha
ఏక ముఖ రుద్రాక్షను కరెక్ట్ గా ధరించిన వ్యక్తి కి.. ఆ శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయట. అంతేకాకుండా..దీనిని ధరించడం వల్ల.. ఆ వ్యక్తి కుటుంబంలోనూ సుఖ సంతోషాలు లభిస్తాయట. ఆ కుటుంబం మొత్తం సుఖ, సంతోషాలతో ఉంటుందట.
Rudraksha
ఏకముఖ రుద్రాక్ష ధరించిన వారిలో చావు భయం అనేది ఉండదట. చాలా ధైర్యంగా ఉంటారట. దాదాపు వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావట.
అంతేకాకుండా.. ఏక ముఖ రుద్రాక్ష ధరించిన వారిలో ఒత్తిడిలాంటివి ఎక్కువగా ఉండవట. వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, హాయిగా జీవితం సాగుతుందట. జీవితంలో ఉన్న చాలా సమస్యలు కూడా తగ్గిపోతాయట.
మరి.. ఈ రుద్రాక్షను ఎలా ధరించాలో తెలుసా? సింగిల్ రుద్రాక్షను.. ఎరుపు రంగు దారంలో గుచ్చి.. మెడలో ధరించాలి. లేదంటే... నార్మల్ రుద్రాక్షలతో కలిపి శివ మాల లాగా కూడా ధరించవచ్చు. వెండి, బంగారం కేపింగ్ తో కూడా తయారు చేస్తారు.