Vastu Tips: వాస్తు ప్రకారం ఈ ఒక్కటి పర్సులో పెట్టుకుంటే చాలు.. డబ్బుకు లోటే ఉండదు!
ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. డబ్బుకు లోటు ఉండకూడదు అనుకుంటారు. అందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం ఈ ఒక్కటి మీ దగ్గర ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. మరి అదెంటో తెలుసుకోండి.

హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం చేస్తే పనులన్నీ సాఫీగా జరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. వాస్తు నియమాలు పాటిస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
వాస్తు ప్రకారం..
మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాల వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం లవంగం శుభప్రదమైంది. లవంగాలతో డబ్బు పెంచే కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పర్సులో లవంగం
వాస్తు ప్రకారం మీ పర్సు లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో లవంగం ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. డబ్బు పెరుగుతుందట. జీవితంలో ప్రశాంతంగా ఉంటారట. వాస్తు శాస్త్రాన్ని నమ్మే చాలామంది దీన్ని ఫాలో కూడా అవుతారట.
పనిలో విజయం
వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో లవంగం ఉంచుకుంటే సమస్యలు తొలగిపోయి పనిలో విజయం వస్తుందట. మీ పనిలో మీరు ఎదగాలంటే వెంటనే మీ పర్సులో లవంగం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
చెడు దృష్టి
వాస్తు ప్రకారం మీ దగ్గర లవంగం ఉంటే చెడు దృష్టి మీపై పడకుండా ఉంటుంది. లవంగం జేబులో లేదా పర్సులో ఉంచుకోవడం మంచిది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇంట్లో ఎప్పుడూ సంతోషం, శాంతి నెలకొంటాయి. ఆర్థికంగా బాగుంటుంది.