గరుడపురాణం ప్రకారం.. ఎంత దానం చేయాలో తెలుసా?
మనం సంపాదించిన దాంట్లో దానం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. నిజానికి కచ్చితంగా దానం చేయాలి.
donate
దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఇది అందరూ నమ్మే విషయం. మన దగ్గర ఉన్నదాంట్లో లేనివారికి దానం చేయడం మంచిదని మనం అందరూ నమ్ముతూ ఉంటాం. ఆహారం, డబ్బు, విద్య ఇలా చాలా దానాలు ఉన్నాయి. కానీ, గరుడ పురాణం ప్రకారం ఎవరు ఎంత దానం చేయాలో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం…
మనం సంపాదించిన దాంట్లో దానం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. నిజానికి కచ్చితంగా దానం చేయాలి. అయితే.. మనం ఎంత మొత్తం దానం చేస్తున్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలట.
అంతేకాదు.. ఎవరైనా తమను తాము పేదవారు అని భావించినట్లయితే…వాళ్లు ఎవరికీ దానం చేయకూడదట. అంతేకాదు.. ఎవరో చూస్తున్నారని, మరోవెరినో మెప్పించడానికి, షో ఆఫ్ కోసం ఎప్పుడూ దానం చేయకూడదట. ఇలాంటి దానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గరుడ పురాణం చెబుతుంది. చేసే దానం కొంచమైనా మనస్ఫూర్తిగా చేయాలట.
అంతేకాకుండా.. తమ స్థాయికి మించి దానాలు కూడా చేయకూడదు. మనకు లేకుండా ఇతరులకు దానం చేయడం వల్ల ఇతరులు పొగడచ్చు. కానీ.. భవిష్యత్తులో అలా మీకు మించిన దానం చేయడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం రావచ్చు. కాబట్టి ఆ పొరపాటు చేయకూడదని గరుడపురాణం చెబుతోంది.
money
మనం సంపాదించిన దాంట్లో కొంత మాత్రమే దానం చేాయలంటే.. అంటే.. మనం 100 రూపాయలు సంపాదిస్తే.. అందులో పది రూపాయలు మాత్రమే ఎవరికైనా దానం చేయడానికి వాడాలట. మిగిలినవి మనకోసం ఉంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదట.
ఇక, దానం చేయడం మంచిది అన్నారు కదా అని ఎవరికి పడితే వాళ్లకు దానం చేస్తే.. మనకు సత్ఫలితాలు లభించవు. మనం చేసే దానం అందుకునే వ్యక్తి కూడా అర్హుడై ఉండాలి. అర్హత లేనివారికి దానం చేయడం వల్ల ఉపయోగం ఉండదుు అని గరుడ పురాణం చెబుతుంది. ఇక తమ జీవిత కాలంలో.. మంచి దానాలు చేసిన వారు మాత్రమే స్వర్గానికి వెళతారట. లేదంటే.. వారు నరకానికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.