విదేశాల్లోనూ వినాయకుడు చాలా ఫేమస్: ఆ దేశాలు ఇవే
వినాయక చవితి అంటే ఇండియాలో చాలా ఫేమస్. చరిత్ర ప్రకారం శతాబ్దాలుగా చవితి పండగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే విదేశాల్లో కూడా వినాయక చవితి పండగను వైభవంగా నిర్వహిస్తారని మీకు తెలుసా.. భారత్ కాకుండా మరికొన్ని దేశాల్లో కూడా శ్రీగణేష్ ని పూజిస్తారు. ఇంతకీ ఆ దేశాలేంటో, అక్కడ విఘ్నేశ్వరుడిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసుకుందాం.
వినాయక చవితి ఎప్పుడు?
ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7, శనివారం నాడు వచ్చింది. ఆ రోజు నుంచే 10 రోజుల పాటు ఉత్సవాలు కూడా మొదలవుతాయి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. భారత్ లోనే కాదు, జపాన్, థాయ్ లాండ్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా వినాయక చవితి నిర్వహిస్తారు. అంతేకాదు, ముస్లింల అతిపెద్ద దేశంలో కూడా గణేష్ ని పూజిస్తారు. ఇంతకీ ఆ దేశాలేంటో, అక్కడ విఘ్నేశ్వరుడిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసుకుందాం.
ఇండోనేషియాలో జ్ఞాన ప్రతీక గణపతి
ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేషియా. ఇక్కడ 270 మిలియన్లకు పైగా జనాభా నివసిస్తున్నారు. వారిలో 87 శాతం మంది ముస్లింలు. అయినా కూడా ఇక్కడ గణపతిని పూజిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇండోనేషియా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయంలో అక్కడి ప్రభుత్వం 20,000 రూపాయల నోటుపై వినాయకుడి ఫోటోను ముద్రించింది. ఆ తర్వాత వారి ఆర్థిక పరిస్థితి బాగుపడిందట. ఇక్కడ విఘ్నేశ్వరుడిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు.
జపాన్ లో 'కాంగిటెన్'
ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశం జపాన్. ఇక్కడ కూడా గణేషుడిని పూజిస్తారు. ఇక్కడ గణపతిని 'కాంగిటెన్' అని పిలుస్తారు. దీని అర్థం 'ఆనంద దేవుడు' అని. ఇక్కడ శ్రీ గణేష్ ని అనేక రూపాల్లో పూజిస్తారు. ముఖ్యంగా నాలుగు చేతుల గణపతిని ఇక్కడ ఎక్కువగా పూజిస్తారు.
శ్రీలంకలో 'పిళ్ళయార్'
భారత్ కు పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా గణనాథుడికి అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ తమిళ ప్రాంతాల్లో నల్లరాతితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజిస్తారు. ఇక్కడ వినాయకుడిని 'పిళ్ళయార్' అని పిలుస్తారు. శ్రీలంకలో ఒకటి, రెండు కాదు ఏకంగా 14 ప్రాచీన గణేష్ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ విహారాల్లో కూడా శ్రీ గణేష్ విగ్రహాలను చూడొచ్చు.
థాయ్‌లాండ్‌లో 'ఫ్రరా ఫిఖానెట్'
థాయ్‌లాండ్‌ని ఏనుగుల దేశం అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా మంది ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. ఇక్కడ శ్రీ గణేష్‌ని 'ఫ్రరా ఫిఖానెట్' అనే పేరుతో పూజిస్తారు. దీని అర్థం 'అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు' అని. ఇక్కడ ఏ శుభకార్యం మొదలుపెట్టాలన్నా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ. ఇక్కడ కూడా గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.
Disclaimer
ఈ ఆర్టికల్ లో ఉన్న సమాచారం అంతా జ్యోతిష్యులు, పంచాంగం, పురాణాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. వీటిని మీకు అందించడంలో మేము కేవలం ఒక మాధ్యమం మాత్రమే. కాబట్టి, వీటిని కేవలం సమాచారంగానే భావించాలని మా విజ్ఞప్తి.