MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Spiritual
  • Chanakya Neeti: ఈ 3 పనులకు ఖర్చు చేసిన డబ్బు రెట్టింపై మీకు శుభం కలుగుతుంది

Chanakya Neeti: ఈ 3 పనులకు ఖర్చు చేసిన డబ్బు రెట్టింపై మీకు శుభం కలుగుతుంది

Chanakya Neeti: సాధారణంగా డబ్బును లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారం ఖర్చుపెట్టకూడదని చెబుతుంటారు. కాని ఆచార్య చాణిక్యుడు మాత్రం 3 విషయాల్లో ఆలోచించకుండా ఖర్చుపెట్టమని సలహా ఇస్తున్నారు. ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బు రెట్టింపై మన దగ్గరకు వస్తుందని చెబుతున్నారు. ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 07 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప పండితులలో ఒకరు. ఆయన తెలివితేటలు అపారమైనవి. ఆయన నీతి సూత్రాలు పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. శతాబ్దాల క్రితమే మనిషి సక్రమంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, క్రమశిక్షణతో ఎలా జీవించాలో తన నీతి సూత్రాల ద్వారా వివరించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అతను చెప్పిన సూత్రాలు ఈ కాలంలో కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆయన తెలిపిన జీవిత సూత్రాలను మన జీవితంలోకి అన్వయించుకుంటే అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో 3 పనులపై డబ్బును ఎంతైనా ఖర్చు పెట్టమని చెప్పారు. ఈ పనుల్లో ఖర్చు చేసిన డబ్బు రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఆ 3 పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

35

సమాజ సేవ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయండి

ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం సమాజ సేవ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు డబ్బును తక్కువ ఖర్చు చేయాలని ఆలోచించకూడదు. అక్కడ అవసరానికి తగ్గట్టుగా ఖర్చు చేయాలి తప్ప అంత ఖర్చు పెట్టే స్థాయి మన దగ్గర లేదని అనుకోకూడదు. మంచి పని చేయాలని సంకల్పిస్తే ఆటోమెటిక్ గా డబ్బు వివిధ దారుల్లో వచ్చి చేరుతుంది. చెట్లు నాటడం, రోడ్లు నిర్మించడం, చెరువులు తవ్వించడం, ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెండింతలై మళ్లీ ఆ వ్యక్తి వద్దకే వస్తుంది.  
 

45

ధర్మ కార్యాల కోసం డబ్బు ఖర్చు చేయండి

ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం ధర్మంగా ఆచరించే పనుల కోసం డబ్బును ఎంతైనా ఖర్చు చేయాలి. మంచి పని చేసేటప్పుడు వెనక్కి తగ్గకూడదు. మీ శక్తి మేరకు డబ్బు ఇవ్వాలి. ధార్మిక కార్యాలలో ఖర్చు చేసిన డబ్బు పరలోకంలో మీకు సహాయపడుతుందని ధర్మ గ్రంథాలలో ఉందని చాణక్యుడు బోధించారు. సమాజంలో ధర్మం నిలబడటానికి అవసరమైన పనులు జరుగుతుంటే అంటే ఆలయాలు కట్టడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అన్నదానాలు చేయడం ఇలాంటి ధర్మాచరణ పనులకు తప్పకుండా డబ్బు ఇవ్వాలి.

55

పేదలకు సహాయం చేయండి 

ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం మీ ముందు ఎవరైనా పేద వ్యక్తి సహాయం కోసం వస్తే, వారికి మీకు తోచిన సాయం చేయండి. సాయం అంటే ధన రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు ఆహారం, వస్తువులు ఇలా ఏదైనా ఇవ్వొచ్చు. ఇలా  చేయడం వల్ల మీ మనసుకు శాంతి కలుగుతుంది. మీకు రెట్టింపు ఆనందం లభిస్తుంది. పేదలకు చేసిన సహాయం మాత్రమే మీ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. అపాత్ర దానం పనికి రాదు. అంటే అవసరం లేని వారికి ఎంత దానం చేసినా ఉపయోగం ఉండదు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved