నవరాత్రులలో ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి
ఈరోజు నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ నవరాత్రులలో భక్తులందరూ అమ్మవారి పూజలతో లీనమవుతారు
ఈరోజు నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ నవరాత్రులలో భక్తులందరూ అమ్మవారి పూజలతో లీనమవుతారు.తొమ్మిది రోజులు నిష్టగా ఉంటారు. కొందరు భక్తులు అమ్మవారి మాలను ధరించి అమ్మవారిని కొలుస్తారు.
ఈ తొమ్మిది రోజులు ఉపవాసాలతో ఉండి పూజలు చేస్తారు. ఇక ఈ ఉపవాసాలు చేసే భక్తులు కాస్త నీరసంగా కనిపిస్తారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని మంచి పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అవి ఏంటంటే..
అరటిపండు వాల్ నట్స్: అరటి పండ్లు, పెరుగు, వాల్ నట్స్, తేనే ను మిక్సీలో పట్టించాలి. ఇక అందులో వాల్ నట్ సర్వ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఒకే సారి కడుపు నిండిపోయినట్లు అనిపిస్తోంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
హనీ కోకోనట్ బాల్స్: ఇది తయారు చేసుకోవడానికి పీనట్ బట్టర్, తేనె, కొబ్బరి తురుము అవసరపడుతుంది. తేనే, పీనట్ బట్టర్ ని కలిపి కొబ్బరి వేసి మిక్స్ చేయాలి. వీటిని ఉండల్లా చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని తర్వాతకు తినాలి.
ఓట్స్ కీర్: ఓట్స్, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ముందుగా నెయ్యిని వేడిచేసి అందులో ఓట్స్ వేసి కలపాలి. తర్వాత పాలు పోసి వాటిని మెత్తగా చేయాలి. తరువాత డ్రైఫ్రూట్స్ వేసి గట్టిగా అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత తీసుకోవాలి.
రోస్టడ్: పచ్చి రోస్టడ్ బయట మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసి అందులో ఉప్పు, బ్లాక్ పేపర్ వెయ్యాలి. తర్వాత మసాలా కూడా వేసి రోస్ట్ చేసుకొని తినడం వల్ల నీరసం అనేది ఉండదు.
డ్రై ఫ్రూట్స్: ఈ సమయంలో ఎక్కువగా గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్స్ మంచి శక్తిని అందిస్తాయి. కాబట్టి ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల నీరసం అనేది పోతుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాస్త శక్తి వస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఉపవాసం సమయంలో చాలా ఉపయోగపడుతుంది.
యోగర్ట్: యోగర్ట్ తీసుకోవడం వల్ల శరీరానికి బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే కేలరీలు మంచి శక్తిని ఇస్తాయి. కాబట్టి ఉపవాస సమయంలో ఇది తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి ఉంటుంది. అందుకు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వీటిని తినడానికి ఇష్టపడాలి.