MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Special
  • ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టులు , పైలట్లను భయపెట్టే విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయంటే..?

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టులు , పైలట్లను భయపెట్టే విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయంటే..?

విమాన ప్రయాణం అంటే లగ్జరీ సింబల్.. విలాసవంతంగా ప్లెయిన్ లో వెళ్తుంటారు చాలామంది. ఇది ఎంత హాయిగా ఉంటుందో.. అంతే ప్రమాదకరంగా  కూడా ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. విమానాలే కాదు ఎయిర్ పోర్ట్ లు కూడా ప్రమాదకరమైనవి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పెర్ట్ లు ఏవోతెలుసా..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 23 2025, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
agatti airport

agatti airport

ఏరోడ్రోమ్ ఎయిర్ పోర్ట్. ఇండియాలోని లక్షద్వీప్ పరిధిలోని  అగతి ద్వీపంలో నిర్మించిన ఎయిర్పోర్టే ఇది. ఈ ఎయిర్పోర్టులో రన్వే పొడవు 4 వేల అడుగులు మాత్రమే. అంతే కాకుండా ఇది చూట్టూనీరు..  నీటి మధ్యలో ఎయిర్ పోర్ట్ కట్టారు. దీంతో ఈ ఎయిర్ పోర్ట్ రన్ వే మీద ప్లెయిన్స్ దిగాలీ అంటే అది పైలెట్ కు అగ్ని పరిక్షే... ఏమాత్రం తేడా వచ్చిన విమానం అటు నుంచి అటు జలసమాది అవ్వడమే.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సెయింట్ మార్టిన్ లొ ఉన్న ప్రిన్సెస్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇది ఇంకా విచిత్రమైన ఎయిర్పోర్ట్. దీని  రన్వే ఎక్కడ కట్టారో తెలుసా  సముద్రం పక్కన బీచ్ను ఆనుకొనే ఈ ఎయిర్పోర్టు ఉంటుంది. ఇక్కడ.ప్లైట్స్  ల్యాండ్ కావడం అంటే పైలెట్లకు కత్తిమీద సాములా ఉంటుంది. ఒక్కోసారి బీచ్లోకి వచ్చిన మనుషులపై నుంచి విమానాలు పోతుంటాయి. ప్రమాదాలు జరిగితే అవి భారీ స్తాయిలో ఉంటాయి. కొంత మంది మాత్రం.. ఇక్కడ ఉన్న బీచ్ కు వచ్చి.. డేంజరస్ ప్లేయిన్స్ కింద నిలుచుని థ్రిల్ ఫీల్ అవుతుంటారు.  

38

ఇక హాంకాంగ్లోని కాయ్ తక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందింది. ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ చేయడం చాలా కష్టం. చూట్టూ ఎత్తైన కొండలు.. గుట్టలు.. అడవులు.. వాటి నడుమ ఎక్కడో లోయలో ఈ విమానాశ్రయం ఉంటుంది.  అందమైన ప్రకృతి నడుమ ఉన్న ఈ విమానాశ్రయం లోయలో.. కొండల నడుమ ఉండటం వల్ల.. సిగ్నలింగ్ ప్రాబ్లమ్ వస్తుంటుంది. దీని వల్ల  ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ..  ఇక్కడ లాండ్ అవ్వాలి అంటే పైలెట్ తడిసిపోతుంది. ఈ ఎయిర్పోర్టును 1998లో మూసేసి అక్కడి ప్రభుత్వం వేరే చోట కొత్తగా నిర్మించింది.
 

48

న్యూజీలాండ్ లోని ల్లింగ్టన్ ఔట్ స్కర్ట్స్ లో  రాంగొటాయ్ ప్రాంతంలో నిర్మించిన వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వే చాలా ప్రత్యేకమైనది. దీని ప్రత్యేకత ఏంటీ అంటే..  ఈ రన్వే స్టార్టింగ్ లో.. చివర్లో నీటి కొలనులు ఉన్నాయి. 6,351 అడుగుల పొడవైన ఈ రన్వైపై విమానాన్ని ల్యాండింగ్, టేకాఫ్ చేసే సమయంలో పైలెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనురెప్ప మూసి తెరిచేలోగా..  విమానాలు ఆ కుంటల్లోకి దూసుకొని వెళ్లడం ఖాయం.

58

ఇక స్కాట్లాండ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బిరా ద్వీపంలో ఉన్న ఎయిర్పోర్టునే బిరా ఎల్లోగేరి ఎయిర్పోర్ట్ లేదా ది బిరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. చాలా తక్కువ నిడివి ఉండే రన్వే ఉండటంతో దీనికి ఆనుకొని ఉన్న బీచ్ను కూడా రన్వేలా ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఒక బీచ్ను రన్వేలా ఉపయోగించే ఎయిర్పోర్ట్ ఇదొక్కటే. అంతే కాదు... సీనియర్ ఫైలెట్లనే చాలా కన్య్ఫూజ్ చేసే ఈ రన్ వే.. ఇక  కొత్త పైలెట్లను ముప్పు తిప్పలు పెడుతుంది. దీని కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అందుకే దీన్ని కూడా ప్రమాదకరమైన విమానాశ్రయాల జాబితాలో చేర్చారు.

68

ఇప్పుడు చూసిన ఎయిర్ పోర్ట్ లకంటే చాలా విచిత్రమైన.. అత్యంత్ర ప్రమాదకరమైన ఎయిర్ ఇదే.. ఫ్రాన్స్  ఆల్ఫ్స్ పర్వతాల నడుమ నిర్మించిన కొష్రొవెల్ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. పర్వతాలను చూడటం  కోసం వెళ్లే వారికోసం నిర్మించిన ఈ విమానాశ్రయంలో రన్వే పొడవు కేవలం 537 మీటర్లే. పైగా ఈ రన్వే ఎగుడుదిగుడుగా ఉంటుంది. పైలెట్లు ఇక్కడ విమానాన్ని దింపాలంటే ముందు పర్వతాను దాటించి.. వాటిని ఢీకొట్టకుండా రన్వేలో దింపాల్సి ఉంటుంది. ఇదేదో ఫైలెట్లకు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. 

78

ఇక మన పొరుగు దేశమైన నేపాల్ లో కూడా భయంకరమైన ఓ ఎయిర్ పోర్ట్ ఉంది. నేపాల్లోని సోలుఖుంబు జిల్లా ఖుంబులో  లాక్లా ఎయిర్పోర్ట్ ఉంది. 2008లో దీనికి టెన్సింగ్ హిల్లరీ ఎయిర్పోర్టుగా పేరు మార్చారు. దీని ప్రత్యేకత ఏంటీ అంటే ఇది  8వేల అడుగుల ఎత్తులో హిమాలయాల్లో నిర్మించారు. ఈ విమానాశ్రయం గత 20 ఏళ్లుగా మోస్ట్ డేంజరస్ జాబితాలో ఉంది.ఈ ఎయిర్పోర్టులో విద్యుత్ ఉండే సమయం చాలా తక్కువ. ప్రపంచంలోని ఇతర ఎయిర్పోర్టుల్లో ఉండే అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ కూడా ఉండదు. దీంతో పైలెట్లు ముందు ఈ ఎయిర్పోర్టుకు వెళ్లడానికే నానా తంటాలు పడాలి. 
 

88

జపాన్ లోని ఒసాకా బే సమీపంలో సముద్రం మధ్యలో కృత్రిమంగా నిర్మించిన దీవుల్లో కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. చుట్టూ నీళ్లు ఉండే ఈ విమానాశ్రయ రన్ వే విమానాలను దించాలంటే ముందు పైలెట్ గుండె దిటవు చేసుకోవాల్సిందే. ఒసాకా విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి ఈ కాన్సాయ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయానికి భూకంపాలు, తుఫాన్ల నుంచి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. అంతే కాకుండా గ్లోబల్ వార్మింగ్ కారణంగా రాబోయే నాలుగైదు దశాబ్దాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగితే ఈ విమానాశ్రయం పూర్తిగా సముద్రంలో కలిసిపోవడం ఖాయం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Temples: గుడిలో కొబ్బరి కాయ ఎందుకు కొడతారు, ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?
Recommended image2
మొన్న కేరళలో, నేడు విజయవాడలో : కొండ చరియలు ఎందుకిలా విరిగిపడుతున్నాయి? కారణాలేంటి?
Recommended image3
ట్రైల్ రూమ్ లో కెమేరాలు ఉన్నాయేమో తెలుసుకునేదెలా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved