ఈ రాష్ట్రాల్లో మందు తాగడంలో ఆడవాళ్లు.. మగవాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారే..!
మగవాళ్లే మందు తాగుతారు.. ఆడవాళ్లు మందును ముట్టుకోను కూడా ముట్టుకోరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒకప్పటి ముచ్చట. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు మగవారితో పోటీ పడి మరీ మందును లాగిస్తున్నారు.
మగవాళ్లు మాత్రమే మందు తాగుతారు. ఆడవాళ్లు అస్సలు తాగరు.. అనేది పాత ముచ్చట. ఈ కాలంలో ఆడవాలు కూడా మందును లాగిస్తున్నారు. అంతేకాదు చాాలా మంది ఆడవారు మందులకు బానిసలుగా మారిపోతున్నారు కూడా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా.. ఏయే రాష్ట్రాల మహిళలు మందును ఎక్కువగా తాగుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరుణాచల్ ప్రదేశ్‌లో పురుషులు 53% ,మహిళలు 24% మద్యాన్ని తాగుతారు. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఆడవారికి మద్యం తాగే అలవాటు ఉంది.
ఆడవాళ్లు ఎక్కువగా మందు తాగే రాష్ట్రంలో సిక్కిం రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని మహిళల్లో 16.2% మందికి మద్యం తాగే అలవాటు ఉంది.
ఆడవాళ్లు మందును ఎక్కువగా తాగే రాష్ట్రాల్లో అస్సాం మూడో స్థానంలో ఉంది. అస్సాంలోని మహిళల్లో 7.3% మంది మద్యం తాగుతున్నట్టు NFHS-5 గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయానికి రూ.40,000 కోట్ల లక్ష్యం నిర్దేశించుకుంది. ఈ రాష్ట్రంలో 6.7% మహిళలు మద్యం తాగుతున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో కూడా మద్యపానానికి బానిసైన మహిళలు ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. జార్ఖండ్ మహిళల్లో 6% కంటే ఎక్కువ మంది మహిళలు మద్యం తాగుతున్నారు.
పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన అండమాన్, నికోబార్ దీవులలో కూడా మద్య వ్యసనంలో మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ 5% మహిళలు మద్యం తాగుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో కూడా మద్యం దుకాణాలను వెతుక్కుంటూ వెళ్లే మహిళలు ఎక్కువగానే ఉన్నారు. NFHS-5 గణాంకాల ప్రకారం.. 4.9% మహిళలు మద్యం తాగుతున్నారు.