'ఇద్దరి లోకం ఒకటే' రివ్యూ

First Published 25, Dec 2019, 3:18 PM

--సూర్య ప్రకాష్ జోశ్యుల:

ప్రేమ కథలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. అదొక యూనివర్శిల్ ఎలిమెంట్. మానవ జీవితాలతో ముడిపడిన అంశం.అందుకే సినిమావాళ్ల దృష్టి ఎప్పుడూ వాటిపై ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్యూర్ ప్రేమ కథలు తగ్గాయి. హృదయాలనుంచి పుట్టే ప్రేమ కథలు కన్నా శారీరక ఆకర్షణలతో నడిచే కథలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో టర్కీలో వచ్చిన  ‘లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్‌’ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ దిల్ రాజు 'ఇద్దరి లోకం ఒకటే' ని మన ముందుకు తెచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది. రీమేక్ చేసేటంత విషయం ఉన్న కథేనా...హైలెట్స్ ,మైనస్ లు ఏమిటో చూద్దాం.
 
కథేంటి పుట్టుకలోనే మ‌హి (రాజ్‌త‌రుణ్‌), వ‌ర్ష (షాలినీ పాండే) ఇద్దరూ ఒకరికోసం మరికొరు పుట్టారని..అది విధి లిఖితం అని అర్దమవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ పరిచయం అయ్యి..,ప్రాణ స్నేహితులు అవుతారు. కానీ విధి వాళ్లిద్దరిని ఎనిమిదేళ్ల వయస్సులోనే విడతీసేస్తుంది. ఇద్దరూ వేర్వేరు చోట్ల  పెరిగి పెద్దవుతారు. ఆ తర్వాత మళ్లీ 18 ఏళ్లకు కలుస్తారు. చిన్నప్పటి మెమరీస్ వాళ్లని ఓ దగ్గరకి చేరుస్తాయి. అప్పటికి మహి తన తండ్రిలా ఫొటో గ్రఫీలోకి వచ్చి పెద్ద ఫొటో గ్రాఫర్ అయ్యి...ఫొటో ఎగ్జిబిషన్స్ పెట్టే స్దాయికి ఎదుగుతాడు.

మరో ప్రక్క వర్ష.. తన తాతలా నట జీవితం ఎంచుకుని నటి కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇద్దరు ఇక ఒకటవుతారు అనుకునే లోపే...మహి జీవితంలో ఓ పెద్ద సమస్య ఉందని తెలుస్తుంది. అది ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది. ఆ సమస్యతో తాను వర్ష కు ప్రేమను ప్రపోజ్ చేయటం ఎంతవరకూ సబబు అనుకుంటాడు మహి. కానీ ఆమెపై ప్రేమను వదులుకోలేకపోతాడు. దూరం జరగలేకపోతాడు. ఆ సమస్య మరింత పెద్దదవుతుంది. అప్పుడైనా ఆ సమస్యను వర్షకు చెప్పాడా...ఆమె ఎలా స్పందించింది. చివరకు ప్రేమికలు ఇద్దరూ ఒకటయ్యారా...చివరకు ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.

ఎలా ఉందంటే...  సినిమా ప్రారంభం చూడగానే ఖుషీ సినిమా...మనసంతా నువ్వే గుర్తు వస్తాయి. గీతాంజలి కూడా మన జ్ఞాపకాల్లో మెదులుతుంది. కానీ నిజానికి వాటికి ఈ సినిమాకు అసలు సంభందం లేదు. ఇది ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అయితే సినిమాలో ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ స్దాయి చాలా తక్కువుగా ఉంటుంది. ఒరిజనల్ టర్కిష్ సినిమాని యాజటీజ్ మార్పులు లేకుండా ఫాలో అవటం మూలంగా అది మనకు మరింత స్పష్టంగా కనపడుతుంది

మన ఆడియన్స్ ఏదైనా కాస్తంత నొక్కి చెప్పాలి. అది ఈ సినిమాలో కనపడదు. అలా లైటర్ వీన్ లో వెళ్లిపోతుంది. స్లో నేరేషన్ నడవటంతో అక్కడక్కడా లాగిన ఫీలింగ్ వస్తుంది. ప్రక్కకు వెళ్లకుండా ఒకే ట్రాక్ లో లవ్ స్టోరీ నడవటం కూడా ఇలా అనిపించటానికి కారణం కావచ్చు. సినిమా ఒకే పాయింట్ చుట్టూ తిరగటం,మలుపులు లేకపోవటంతో ..ఏమీ జరిగినట్లు అనిపించదు. ముఖ్యంగా సెకండాఫ్ లో పెద్దగా కథ కదిలినట్లు అనిపించదు. క్లైమాక్స్ కు వచ్చేసరికి మన గుండె బరువెక్కుతుంది.

అయితే అక్కడదాకా మనం ఆ ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ విసుక్కోకుండా ఉండగలగాలి. అయితే నిజ జీవిత ప్రేమ కథలా ..ఏ విధమైన కుదుపులు లేకుండా దర్శకుడు తీసాడని అర్దమవుతుంది. హడావిడి చేసి క్లైమాక్స్ ఫీల్ ని పోగొట్టుకండా ప్రయత్నించాడని తెలుస్తుంది. అయితే ఆ ఓపిక ఎంత మందికి ఉందనేదానిపై సినిమా విజయం స్దాయి ఆధారపడి ఉంటుంది.

దర్శకుడిగా.. ఈ సినిమా డైరక్టర్ జీఆర్ కృష్ణ...యాజటీజ్ ఒరిజనల్ ని ఫాలో అవకుండా తెలుగు వెర్షన్ కు మార్పులు చేర్పులు చేస్తే మరింత బాగుండేది. అయినా కొన్ని భావోద్వేగమైన సన్నివేశాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ లో తన ప్రతిభను చూపించగలిగారు. అయితే రీమేక్ లతో ఓ సమస్య ఎప్పుడూ ఉంటుంది. బాగుంటే ఒరిజనల్ డైరక్టర్ ఖాతాలో పడిపోతుంది. బాగోపోతే..మంచి సినిమాని పాడు చేసారంటారు. కత్తిమీద సామే. ఈ విషయం తెలినట్లుంది. చాలా అప్రమత్తంగా వర్క్ చేసాడు. అయితే సామాన్య ప్రేక్షకుడుని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. కేవలం మల్టిఫ్లెక్స్ వారికే నచ్చేట్లు తయారైంది.

హైలెట్స్ లో షాలినీ పాండే ఒకరు. ఈ సినిమాలో ఆమె నటనా విశ్వరూపం కనిపించింది అని చెప్పాలి. ఎంతలా నటించిందంటే రాజ్ తరుణ్ పూర్తిగా తేలిపోయాడు. అలాగే రాజ్ తరుణ్ నుంచి అతని స్టైల్ వెటకారం, వ్యంగ్యం, ఫన్ ఆశిస్తే మాత్రం ఈ సినిమా పొరపాటున కూడా ఎక్కదు. ఇక సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకు మరో రెండు పిల్లర్స్. దిల్ రాజు బ్యానర్ కాబట్టి ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన పనిలేదు.

మైనస్ ల విషయానికి వస్తే...  సినిమా చాలా చోట్ల సాగినట్లు నత్త నడక నడిచింది. అలాగే ఈ సినిమాకు రాజ్ తరుణ్ సరైన ఆప్షన్ కాదనిపిస్తుంది. అతన్ని సీరియస్ గా చూస్తూంటే ఫీల్ వర్కవుట్ కాలేదు. అలాగే కథలో మన తెలుగు ఆడియన్స్ సరపడ ట్విస్ట్ లు, టర్న్ లు లేకపోవటం.

ఫైనల్ థాట్  మనస్సుతో చూడాల్సిన సినిమాలు మనకు నచ్చుతాయా...?చూడాలి.

Rating:2.5

Rating:2.5

loader