శృంగారం ఎందుకంత ఆనందానిస్తుంది..?
సెక్స్ వల్ల వల్ల మనసుకు, శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి చాలా మందికి తెలుసు. సాధారణంగా రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనే వారికంటే సెక్స్ లో మొత్తమే పాల్గొనని వ్యక్తులు బద్దకంగా ఉంటారని, వీరికి ఎన్నో అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆహ్లాదకరమైన శృంగారం మనిషి మెదడుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందట. ఇది లైంగిక ఆనందాన్ని పెంచే హార్మోన్లను విడుదల చేస్తుంది . అలాగే సెక్స్ ను మరింత ఆనందంగా మారుస్తుంది. 2016 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. మెదడు అత్యంత ముఖ్యమైన లైంగిక అవయవం కావొచ్చని కనుగొన్నారు.
సెక్స్ సమయంలో యోని, పురుషాంగం, కటిలోని కణజాలానికి రక్తం సరఫరా పెరుగుతుంది. ఇది శరీరంలోని ఈ భాగాల్లోని నరాల సున్నితత్వాన్ని పెంచుతుంది. ఈ రక్త ప్రవాహం ట్రాన్సుటేట్ అనే ద్రవాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది యోనిని లూబ్రికేట్ చేస్తుంది.
అలాగే సంభోగం సమయంలో శరీరమంతా కండరాలు సంకోచించడం ప్రారంభిస్తాయి. ఈ భాగాల్లో రక్త ప్రవాహం పెరగడం వల్ల కొంతమంది శ్వాసను ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకుంటారట. ఇంకొంతమందికి చర్మం ఎర్రగా మారుతుందట. ఇద్దరిలో లైంగిక కోరికలు పెరిగినప్పుడు జంట లైంగిక జీవితంలో క్లైమాక్స్ కు వెళతారు.
చాలా మంది ఆడవారికి క్లైటోరల్ ఉద్దీపన వారు భావోద్వేగాల ఉద్వేగాన్ని చేరుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఇది. శరీరంలో జరిగే అనేక రసాయనిక మార్పులే శృంగారంలో మిమ్మల్ని సంతోషపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
దంపతులు భావప్రాప్తికి చేరుకున్న తర్వాత వీరి కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళతాయి. అలాగే శరీరం నెమ్మదిగా దాని పూర్వ స్థితికి తిరిగి వస్తుంది. ఈ ప్రక్రియ పురుషులకు, స్త్రీలకు చాలా భిన్నంగా ఉంటుందట. చాలా మంది పురుషులు స్ఖలనం చేసిన వెంటనే భావప్రాప్తిని పొందుతారు. కానీ ఆడవారికి ఇలా ఉండదు. వీరికి ఎక్కువ సమయం పడుతుందట.