Relations: బ్రేకప్ తర్వాత.. మీ మాజీ ఎదరుపడితే..?
తమ మాజీ ఉన్నారు అని తెలిస్తే.. అక్కడికి వెళ్లడానికే ఆసక్తి చూపించరు. కానీ తప్పక ఎదుర్కోవాలి వస్తే.. ఇబ్బంది గా.. చాలా ఒత్తిడిగా ఉంటుంది. కానీ.. చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రేమలో ఉన్నప్పుడు వారే సర్వస్వంగా బతికేస్తారు. వారే ప్రపంచంగా ఉంటారు. ప్రతి నిమిషం వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ.. ఒక్కసారి ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాలు వచ్చి.. విడిపోయిన తర్వాత ఎవరికివారే బతికేస్తూ ఉంటారు. అలా విడిపోయిన వారు.. మళ్లీ ఎదురుపడితే చాలా కష్టంగా ఉంటుంది. అప్పటి వరకు ప్రాణం గా ప్రేమించినవారైనా సరే.. విడిపోయిన తర్వాత.. రెండు నిమిషాలు ఎదరుపడినా.. వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది.. ఏకంగా మాజీ తో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే.. తప్పని పరిస్థితుల్లో.. మళ్లీ కలవాల్సి వస్తే.. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
దాదాపు.. తమ మాజీ ఉన్నారు అని తెలిస్తే.. అక్కడికి వెళ్లడానికే ఆసక్తి చూపించరు. కానీ తప్పక ఎదుర్కోవాలి వస్తే.. ఇబ్బంది గా.. చాలా ఒత్తిడిగా ఉంటుంది. కానీ.. చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక.. ఊరికే చెమటలు పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక.. పక్కన వారు కూడా.. మీ మాజీ ఉన్నారనే విషయాన్ని గుర్తుచేస్తూ.. మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. అయితే.. ఆ ఒత్తిడిని కూడా తట్టుకొని.. అక్కడ ఏమీ జరగనట్లు చాలా నార్మల్ గా ఉండటానికి ప్రయత్నించాలట.
మీ లాగే.. మీ మాజీ కూడా మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. కానీ.. మీరు వారి గురించి ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీ యాక్షన్స్ తో చెప్పకూడదు. కాన్ఫిడెంట్ గా కనిపించాలి.
దాదాపు.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూసుకోవాలట. మీ మాజీ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక.. గతంలో వారు మీతో ప్రవర్తించిన విషయాలను గుర్తుంచుకొని.. గ్రడ్జ్ తీర్చుకోవాలని అనుకోవద్దు. సమయం దొరికింది కదా.. అని పగ తీర్చుకోవాలని అనుకోవద్దు.. మీరు మూవ్ ఆన్ అయ్యారనే విషయం వారికి అర్థం కావాలి.
గతంలో ప్రేమించుకున్నాం కదా.. అని వెళ్లి రాసుకొని పూసుకొని తిరగకూడదు. అలా అని.. ఎవరో తెలియనివారు లాగా.. ఎవాయిడ్ కూడా చేయకూడదు. నార్మల్ గా.. పరిచయస్తులను పలకరించినట్లు పలకరిస్తే సరిపోతుంది. హుందాగా ప్రవర్తించాలి.
జరిగిపోయిందేదో జరిగిపోయిందనుకోవాలి. పాత విషయాలు గుర్తుతెచ్చుకొని మీరు ఏడ్వడం.. వాళ్లని ఏడిపించడం.. ఆ విషయాలను గుర్తు తెచ్చుకోవడం కూడా అనవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.