చాలా రోజులు శృంగారానికి దూరంగా ఉంటే ఏమౌతుందో తెలుసా?
సెక్స్ భాగస్వాముల మధ్య ఖచ్చితంగా ఉండాల్సిందేనంటారు నిపుణులు. ఎందుకంటే ఇది వీరికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలను, కొట్లాటలను తగ్గిస్తుంది. విడిపోయే అకాశాలు కూడా తగ్గుతాయి. అయితే భార్యాభర్తలు ఎక్కువ రోజులు సెక్స్ కు దూరంగా ఉంటే ఏమౌతుందో తెలుసా?
All these are the reasons why you stay away from sex
సెక్స్ మన జీవితంలో ఒక భాగం. అయితే కొంతమంది జంటలకు తరచూ శృంగారంలో పాల్గొనే అలవాటు ఉంటే.. ఇంకొంతమంది జంటలు మాత్రం అపుడప్పుడు మాత్రమే శృంగారంలో పాల్గొంటుంటారు. ఇంకొంతమంది ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తిగా శృంగారానికి పూర్తిగా దూరంగా ఉంటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు సెక్స్ లో పాల్గొనకపోతే మీ శరీరంలో, మెదడులో ఎన్నో మార్పులు వస్తాయి. అవేంటంటే?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెక్స్ మన మానసిక, శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. 2016 లో జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ బిహేవియర్ లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. సంతృప్తికరమైన సెక్స్ లో పాల్గొన మహిళలకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. సెక్స్ యాంగ్జైటీని, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందుకే సెక్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుందంటారు. అలాగే సెక్స్ శారీరక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యతను కాపాడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
సెక్స్ కూడా ఒక రకమైన వ్యాయామం లాంటిదే తెలుసా? సెక్స్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ గుండెను ఫిట్ గా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక జర్నల్ ప్రకారం.. తరచుగా శృంగారంలో పాల్గొనే పురుషులు, వారానికి 1-2 సార్లు శృంగారంలో పాల్గొనే వారి కంటే రెట్టింపు అంగస్తంభనను అనుభవిస్తారు. సెక్స్ చేయకపోవడం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
Sex Related Injuries
ఇక ఆడవారి విషయానికొస్తే.. వీరు సెక్స్ లో పాల్గొనకపోతే వీరి జననేంద్రియాలు సన్నగా, బలహీనంగా మారుతాయి. ఇలాంటి వారు సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి పుడుతుంది. అసౌకర్యంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆడవారు సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల వీరి కటి ఫ్లోర్ కండరాల బలం తగ్గుతుంది. ఈ కండరాలు మహిళల దిగువ అంతర్గత అవయవాలకు మద్దతునివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
భాగస్వామి సన్నిహిత స్పర్శ శరీరాన్ని ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ఇది ఒత్తిడికి కారణమయ్యే కార్డిసాల్ ను తగ్గిస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా సెక్స్ యే కానవసరం లేదు. భాగస్వామిని కౌగిలించుకోవడం, వారి చేతులను పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి కూడా ఈ ప్రభావాన్ని చూపుతాయి. మీరు సన్నిహిత సంబంధానికి దూరంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు. నిరాశలో కూడుకుపోతారు. బాగా ఒత్తిడికి గురవుతారు. అందుకే మీ భాగస్వామిని ఎప్పటికప్పుడు కౌగిలించుకోండి. వారి చేతులను పట్టుకుని నడవండి. వీలున్నప్పుడల్లా ముద్దు పెట్టుకోండి. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సెక్స్ ను కోరుకోకపోవడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే శృంగారం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.