ముద్దు ముద్దుకో అర్థం.. అక్కడ కిస్ చేస్తే ఏంటి అర్థం..?
'ఎక్కడ', 'ఎప్పుడు' 'ఎవరు' ముద్దు పెడుతున్నారనే విషయాన్ని పట్టి.. దాని అర్థం మారుతుందట. అసలు ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయి.. వాటి అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం..
మనకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే.. ఆ ప్రేమను ముందుగా.. ముద్దు ద్వారానే తెలియజేస్తాం. ముద్దు అనేది ఆప్యాయత భావోద్వేగాలను వ్యక్తీకరించే సన్నిహిత రూపం. తల్లి బిడ్డకి పెట్టే ముద్దు.. భర్త.. భార్యకు పెట్టే ముద్దు ఒకటి కాదు. ఆ రెండింటిలో చాలా వ్యాత్సాసం ఉంది.
ఎక్కడ ముద్దు పెడితే.. ఎలాంటి ప్రేమ తెలియజేస్తున్నామనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలట. అలా తెలుసుకోకపోతే.. కపుల్స్ మధ్య తేడాలు వచ్చే ప్రమాదం ఉందట. ఏ సందర్భంలో ఎలాంటి ముద్దు పెట్టాలి అనే విసయాన్ని కూడా తెలుసుకోవాలట.
ఎక్కడ', 'ఎప్పుడు' 'ఎవరు' ముద్దు పెడుతున్నారనే విషయాన్ని పట్టి.. దాని అర్థం మారుతుందట. అసలు ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయి.. వాటి అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం..
1. పెక్ కిస్..
ఈ కిస్ ని.. లవర్, భాగస్వామి, లేదా తమ పిల్లలకు కూడ ఇవ్వొచ్చు. వారిపై ఉన్న ప్రేమను చూపించడానికి ఇది బెస్ట్ కిస్. ఈ పెక్ కిస్ ని.. ఇద్దరూ ఒకసారి పెదాలను కలిపి పెడతారు. మీకు నచ్చినవారిని ముద్దు పెట్టుకోవడానికి ఇది బెస్ట్ మార్గం. కాగా.. తమకు నచ్చిన వారు దూరంగా వెళ్లిపోయే సమయంలో.. ఈ ముద్దు పెట్టుకోవచ్చు.
2.అమెరికన్ కిస్..
ఇది గాఢమైన ముద్దు. రొమాంటిక్ కిస్ అని కూడా చెప్పొచ్చు. ఇది సెక్స్ కోరికలను పెంచేలా ఉంటుంది. పెదాలను తెరచి.. ఒకరిని మరొకరు ముద్దు పెట్టుకుంటారు. అందరి ముందూ మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవాలంటే ఈ ముద్దును ఉపయోగించవచ్చు. ఈ ముద్దు పెట్టేటప్పుడు.. మీ పార్ట్ నర్ ముఖాన్ని చేతులతో పట్టుకోవడం లేదా.. మెడ చుట్టూ చేతులు వేసుకొని పెడితే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది.
3.ఫ్రెంచ్ కిస్...
ఇది కూడా అమెరికన్ కిస్ లానే ఉంటుంది. కానీ.. ఈ కిస్ లో నాలుక పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఒకరి నాలుకతో మరొకరి నాలుకను పెనవేస్తూ పెట్టే ముద్దును పెడతారు. అమెరికన్ కిస్ తో మొదలుపెట్టి.. ఫ్రెంచ్ కిస్ పెడతారు. ఈ రకం ముద్దు పెట్టుకోవడానికి చాలా ప్రాక్టీస్ అవసరం.
4. బుగ్గుపై ముద్దు..
ఇది చాలా సింపుల్ కిస్. ఎవరిమీద అయినా ఎఫెక్షన్ ఉంటే.. దానిని ఇలా ఈ ముద్దు ద్వారా తెలియజేస్తారు. ఈ ముద్దు ఎవరు.. ఎవరికైనా పెట్టొచ్చు.
5.నుదుటిపై ముద్దు..
మనసులోని మాటను బయటకు చెప్పకుండా.. కేవలం ఈ ఒక్క ముద్దుతో మొత్తం చెప్పేయవచ్చు. ఈ ముద్దు ప్రేమ, బాధ్యత ను తెలియజేస్తుంది. తల్లిదండ్రులు.. తమ బిడ్డలకు కూడా ఈ ముద్దు పెట్టొచ్చు. స్నేహితులకు కూడా ఈ ముద్దు పెట్టొకోవచ్చు. ముఖ్యంగా బాధలో ఉన్నవారిని ఓదార్చడానికి దీనిని వాడొచ్చు.
6.ఎస్కికిమో కిస్..
ఈ ముద్దులో ఒకని ముక్కును మరొకరు తాకుతూ.. ముద్దు పెట్టుకుంటారు. ఎదైనా గొడవ జరిగినప్పుడు.. ఈ రకం ముద్దు పెట్టొచ్చు.
7. మెడ మీద ముద్దు..
మెడ శరీరంలోని ఓ సున్నితమైన భాగం. సెక్స్ లో భాగంగా ఆ ప్రాంతంలో ముద్దు పెడతారు. ఇది చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
8. బటర్ ఫ్లై కిస్..
ఈ కిస్ చాలా క్యూట్ గా ఉంటుంది. ప్ేమను తెలియజేసే క్రమంలో ఈ ముద్దును ఉపయోగిస్తారు. ఒకరి ముఖాన్ని.. మరొకరి ముఖానికి దగ్గరగా తీసుకువచ్చి ఈ ముద్దు పెడతారు. ఈ ముద్దుల్లో ఒకరి కళ్లు.. మరొకరికి టచ్ అవుతాయి.
9.హ్యాండ్ కిస్..
చేతి మీద ముద్దు.. లవ్ ప్రపోజ్ చేసే సమయంలో ఇలాంటి రకం ముద్దులు పెడతారు. అంతేకాకుండా.. పెద్దవారికి కూడా ఈ ముద్దులు పెట్టొచ్చు. అంటే.. వారికి గౌరవం ఇచ్చినట్లు అర్థం.
10. తలపై ముద్దు..
ఈ ముద్దు దాదాపు.. ఇంట్లోని పెద్దవారు.. తమకన్నా చిన్నవారికి ప్రేమతో పెట్టేది. ఈ ముద్దులోనూ ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది.