Divorce: విడాకుల తర్వాత జీవితం మళ్లీ నార్మల్ అవుతుందా?
విడాకులు తీసుకోవడానికి ముందే.. తర్వాత ఏంటి..? అనే విషయం గురించి కచ్చితంగా ఆలోచించాలట. ఆ తర్వాతే.. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. విడాకుల తంతు మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. తర్వాత ఏంటి అనే క్లారిటీ కచ్చితంగా ఉండాలట. లక్ష్యాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలని చెబుతున్నారు.
ఒకప్పుడు.. ఎన్ని మనస్పర్థలు వచ్చినా... కొట్టుకున్నా, తిట్టుకున్నా... విడిపోయేవారు కాదు. ఎవరు ఏమనుకుంటారో.. ఫ్యామిలీ ఏమనుకుంటుందో అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు... ఇద్దరికీ సెట్ అవ్వలేదు అనిపిస్తే.., వెంటనే విడిపోతున్నారు.
నిజానికి ఎవరికీ విడిపోవాలి అనే ఉద్దేశంతో రిలేషన్ లోకి రారు. తమ భాగస్వామితో అందమైన జీవితం గడపాలనే అనుకుంటారు. కానీ.. పరిస్థితులు అన్నీ మనం అనుకున్నట్లు ఉండవు కదా.. ఒక్కోసారి బేధాభిప్రాయాలు రావడం చాలా సహజం. ఈ క్రమంలో.. వారు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే.. విడాకులు తీసుకోవడం చిన్న విషయం కాదు. దాని తర్వాత.. లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు మన కుటుంబం అనుకున్న తన భాగస్వామి కుటుంబం విడాకుల తర్వాత.. మనకు ఏమీకాకుండా పోతుంది. వారి ప్రేమను కోల్పోతాం. ఒంటరితనం వెంటాడుతుంది. మరి విడాకులు తప్పవు అనుకున్నప్పుడు.. అవి తీసుకున్న తర్వాత లైఫ్ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి..? నిపుణులు ఇస్తున్న సలహా ఏంటో ఓసారి చూద్దాం..
విడాకులు తీసుకున్నా కూడా.. అప్పటి వరకు కలిసి ఉన్న పార్ట్ నర్ ని అంత సులువుగా ఏమీ మర్చిపోలేం. ఒక్కోసారి మళ్లీ.. పార్ట్ నర్ తో కలిసి పోవాలనే ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి. కానీ ఆ సాహసం ఎవరూ చేయరు. అంతేకాదు.. కొందరేమో.. తమ పార్ట్ నర్ ని మర్చిపోవడానికి వేరేవారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. కొత్త స్నేహాలు చేస్తారు.
divorce
అయితే.. ఇవన్నీ కాదట... విడాకులు తీసుకోవడానికి ముందే.. తర్వాత ఏంటి..? అనే విషయం గురించి కచ్చితంగా ఆలోచించాలట. ఆ తర్వాతే.. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. విడాకుల తంతు మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. తర్వాత ఏంటి అనే క్లారిటీ కచ్చితంగా ఉండాలట. లక్ష్యాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలని చెబుతున్నారు.
కొత్త ప్రారంభం: మాజీ జీవిత భాగస్వామి ఇప్పటికే మరొకరిని వివాహం చేసుకున్నట్లయితే మీరు దాని గురించి విచారిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. కొత్త ప్రారంభానికి నాందిగా. కొత్త స్నేహితులకు బదులుగా మిమ్మల్ని అర్థం చేసుకునే స్నేహితులతో ట్రిప్ లేదా డిన్నర్ కోసం వెళ్లండి. ఒంటరిగా కాకుండా కుటుంబంతో గడపండి. నృత్యం, సంగీతంతో సహా మీకు ఇష్టమైన అభిరుచిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి.
నమ్మడం నేర్చుకోండి: విడాకుల తర్వాత కొత్త సంబంధాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు. గతంలోని చేదు అనుభవాన్ని అధిగమించేందుకు దృఢమైన మనస్సుతో ప్రయత్నించండి. బ్రేకప్ తాలుకూ బాధను మర్చిపోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మీకు సరైన భాగస్వామి దొరికిన తర్వాత, వారి చేయి పట్టుకోవడానికి వెనుకాడరు.
విడాకులు మీ ఇద్దరి వ్యక్తిగత విషయం. ఈ విషయంలో స్నేహితులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి ముందు అకారణంగా ప్రవర్తించండి. వారు మీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇవ్వండి. ఎందుకు విడిపోతున్నారనే కారణం మీ దంపతులకు తెలిస్తేచాలు.. ప్రపంచానికి కాదు అని గుర్తుంచుకోండి.
విడాకుల తర్వాత చాలా మంది తమ పేరెంట్స్ దగ్గరకు చేరుకుంటారు. అయితే.. వారు మిమ్మల్ని చూసి బాధపడకుండా ఉండేలా చూసే బాధ్యత మీ మీదే ఉంటుంది. మీ భర్త నుండి విడిపోయిన తర్వాత కూడా మీ జీవితం ఆగదని, త్వరలోనే అంతా సవ్యంగా జరుగుతుందని మీ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి. కుటుంబ సభ్యులపై భారం పడకుండా ఆర్థికంగా బలోపేతం చేయండి. ఇంటి పనుల్లో వారికి సహాయం చేయండి.కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోకండి. మీకు ఇప్పటికే ఉద్యోగం ఉంటే, ఆర్థిక సమస్యలు ఉండవు. ఉద్యోగం లేని మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కృషి చేయాలి. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగండి.