పురుషుల్లో అంగ స్తంభన సమస్య.. కారణం ఇదే కావచ్చు..!
కొన్నిరకాల అలవాట్లు, జీవనవిధానంలో మార్పులు, తీసుకునే మెడికేషన్ లో జాగ్రత్తలు తీసుకుంటే 40 దాటినా రేసుగుర్రంలా పరిగెత్తొచ్చనీ చెబుతున్నాయి పరిశోధనలు.
చాలామంది పురుషుల్లో రెగ్యులర్ గా ఎదుర్కునే సమస్య అంగస్తంభన. ఎంతో ఉత్సాహంగా మొదలు పెట్టి పీక్ స్టేజ్ కు చేరుకోకుండానే నిరాశ పడుతుంటారు. దీనికి ప్రధానం కారణం అంగస్తంభన సమస్యే. ఇది ముఖ్యంగా 40 దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరికి ఓ గుడ్ న్యూస్ చెబుతోంది అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్.
అంగస్తంభన సమస్యకు అసలు కారణం న్యూరోలాజికల్ హార్మోన్ల పనితీరు, మానసిక కారణాలేనని అంటున్నారు. అయితే కొన్నిరకాల అలవాట్లు, జీవనవిధానంలో మార్పులు, తీసుకునే మెడికేషన్ లో జాగ్రత్తలు తీసుకుంటే 40 దాటినా రేసుగుర్రంలా పరిగెత్తొచ్చనీ చెబుతున్నాయి పరిశోధనలు.
హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం 25 శాతం మంది పురుషులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. వీరిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందట. ఇది కంటిన్యూ అయితే పురుషత్వం కోల్పోయి, నంపుసకులుగా మారతారని హెచ్చరిస్తున్నారు
బీపీ మందులు, అలెర్జీ మందులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీబయాటిక్స్, క్యాన్సర్ కు చేసే కీమోథెరపీ, కంటి ఆపరేషన్, ప్రొస్టేట్ క్యాన్సర్ కు చేసే ఆపరేషన్స్, క్యాన్సర్ కణుతుల చికిత్స ఇవన్నీ అంగస్తంభన సమస్యకు దారి తీస్తాయట.
కంటి నరాలకు అయ్యే గాయాలు కూడా లైంగిక సమస్యలు కలిగిస్తాయి. పురుషుల్లో వెన్నెముక గాయం కూడా అంగస్తంభన సమస్యకు కారణాలేనట. వీటితో పాటు కామన్ గా కనిపించే డయాబెటిక్ సమస్య కూడా అంగస్తంభన సమస్యకు దారి తీస్తుందట. రక్తంలోని అధిక చక్కెరశాతం పురుషాంగంలోని రక్తనాళాలు, నరాలను దెబ్బతీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అధిక రక్తపోటు వల్ల పురుషాంగంలోని చిన్న రక్త నాళాలు చీలిపోయి, రక్త ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల హార్మోన్ల ఉత్పత్తి తగ్గి అంగస్తంభన సమస్య వస్తుంది. దీంతో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో మార్పు వస్తుంది.
erectile dysfunction
కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ దెబ్బతినడంలాంటివి కూడా పురుషత్వం కోల్పోయేలా చేస్తాయి. పార్కిన్సన్స్ వ్యాధి, మూర్ఛ, స్ట్రోక్, స్క్లెరోసిస్, మెదడులో నరాల దెబ్బతినడం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అనీమియా కూడా ఇతర కారణాలు. ఇక న్యూయార్క్ లోని సినాయ్ మెడికల్ సెంటర్ నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం స్లీప్ అనీమియా కూడా అంగస్తంభన సమస్యకు ప్రధాన కారణమే.
వీటితో పాటు ఎక్కువగా బైక్ రైడింగ్ చేయడం కూడా అంగస్తంభన సమస్యకు దారి తీస్తుంది. ఎక్కువగా బైక్ ట్రావెల్ చేసేవారు. అంటే రోజులు 24 గంటలూ డ్రైవింగ్ లో ఉండేవారికి ఈ సమస్య అధికమట. దీనికి తోడు బైక్ సీటు సరిగా లేకపోవడం కూడా నంపుసకత్వానికి దారి తీస్తుందట.