కలయిక ఆస్వాదిస్తూనే... ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలంటే...?
ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఓసారి చూద్దాం..
పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలని ఆశపడుతుంది. తల్లైతే ఆ మధురానుభూతి చాలా హాయిగా ఉంటుంది. తల్లి తర్వాతే స్త్రీ జన్మ పరిపూర్ణమౌతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే.. కొన్ని సమయాల్లో.. ముఖ్యంగా పెళ్లైన వెంటనే పిల్లలను కనడానికి చాలా మంది ఇష్టపడరు. అలా అని ఒకవేళ గర్భం వస్తే అబార్షన్ చేయించుకోవడం చాలా పెద్ద తప్పు.
అలా కాకుండా ఉండాలంటే.. ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఓసారి చూద్దాం..
పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయంలో మహిళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే విషయం అందరూ తెలుసుకోవాలి. తన రక్షణ చూసుకుంటూ.. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడే పిల్లను కనే హక్కు ఉంటుందని చెబుతున్నారు. అందుకే గర్భం విషయంలో అది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. తెలుసుకోవాలి.
కండోమ్ వినియోగం.. అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్ వినియోగించడం తప్పనిసరి. అమ్మాయిలకు కూడా కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఒకసారి వాడిన కండోమ్ మళ్లీ ఉపయోగించకూడదు.
మహిళలు, పురుషులు ఇద్దరికీ కండోమ్స్.. మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పురుషుల మాదిరిగానే.. స్త్రీలకు కండోమ్స్ ఉంటాయి. అయితే.. కలయిక సమయంలో.. ఇద్దరూ కండోమ్ ధరించాల్సిన అవసరం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు వినియోగిస్తే చాలు.
పురుషులు కండోమ్ కేవలం శృంగారం చేసినంత సేపు మాత్రమే ధరిస్తారు. అయితే.. మహిళలు మాత్రం ఈ కండోమ్స్ ని దాదాపు 8గంటల పాటు ఉంచుుకోవచ్చట. అయినా ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. దీనిని సహజ రబ్బర్, సింథటిక్ రబ్బర్ తో తయారు చేస్తారు.
అయితే.. కండోమ్ వేసుకునే ముందు ఆ ప్యాకెట్ మీద ఎక్స్ పైరీ డేట్ మాత్రం కచ్చితంగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాకుండా దాని మీద FDA, CE, ISO or Kite mark ఇలా ఏదో ఒక గుర్తు ఉండేలా చూసుకోవాలి.
కండోమ్స్ వేడి తగేలే ప్రాంతాల్లో ఉంచకూడదు. డ్యామేజ్ అయిన వాడటం వల్ల ఉపయోగం ఉండదు. ప్యాకెట్స్ లో పెడితే.. కండోమ్ త్వరగా పాడైపోతుంది.
ఇక పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఆ ట్యబ్లెట్స్ ని వైద్యలను సంప్రదించి తీసుకోవాలి. ఏ సమయంలో తీసుకోవాలో.. వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్తపడొచ్చు.
ట్యాబ్లెట్స్ వాడటం ఇష్టం లేకుంటే.. వైద్యులను అడిగితే.. ఇంజెక్షన్ చేస్తారు. ఒక్కసారి ఇంజెక్షన్ చేయించుకుంటే.. కొన్ని నెలలపాటు సంతానం కలగరు.