మీ పార్ట్ నర్ తో సంతోషంగా లేరు అనడానికి సంకేతాలు ఇవే...!
ఒకవేళ మీకు కలయికలో పాల్గొనాలనే కోరిక కలిగినా... మీ పార్ట్ నర్ తిరస్కరించడం లాంటివి చేస్తున్నారు అంటే కూడా... మీరు సంతోషంగా లేరనే అర్థం.
దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు. అందరూ...... తాము సంతోషంగా ఉండాలనే అనుకుంటారు. అయితే.... మనం అనుకున్నట్లుగా అందరి జీవితాలు సంతోషంగా ఉండవు. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, కోపాలు కూడా ఉంటాయి. అసలు... మనం దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నామో లేదో కూడా చాలా మందికి తెలియదట. మీరు సంతోషంగా ఉన్నారో లేదో.. ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు.
దాంపత్య జీవితం సరిగా లేని వారు శృంగారానికి దూరమౌతారు. వారికి అసలు శృంగారంలో పాల్గొనాలనే కోరిక కూడా కలగదు. ఒకవేళ మీకు కలయికలో పాల్గొనాలనే కోరిక కలిగినా... మీ పార్ట్ నర్ తిరస్కరించడం లాంటివి చేస్తున్నారు అంటే కూడా... మీరు సంతోషంగా లేరనే అర్థం.
couple fight
మీరు విడిపోకపోయినా... విడిపోవాలి అనే భావనలు తరచూ కలుగుతున్నాయి అంటే.. మీ దాంపత్య జీవితం సరిగా లేదనే అర్థం. అంతేకాదు.. మీ పార్ట్ నర్ తో కాకుండా.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నా... పెట్టుకోవాలనే ఆలోచన వచ్చినా... మీరు మీ పార్ట్ నర్ తో సంతోషంగా లేరని అర్థం.
ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ.... ఒకరితో మరొకరు కనీసం మాట్లాడుకోకుండా... ఎవరి పని వారు అన్నట్లుగా ఉంటున్నా... మీ బంధం సరిగా లేదనే అర్థం. ఎవరికి వారు సంబంధం లేనట్లుగా బతుకుతున్నారు అంటే... మీ బంధం విడిపోవడానికి దగ్గరగా ఉందని అర్థం.
దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు, సరదాలు ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా.. జీవితంలో కనీసం ఎలాంటి ఫన్ లేకుండా.. బోరింగ్ గా ఉన్నా కూడా.. మీ బంధంలో మీరు సంతోషంగా లేరని అర్థం.
దాంతప్య జీవితంలో దంపతులు ఒకరికొకరు పారదర్శకంగా ఉండాలి. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. తమ బంధం పట్ల కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలాంటి అవాంతరాలు వచ్చినా విడిపోరు అనే నమ్మకం ఉండాలి. ఇవేమీ లేకపోయినా... మీ బంధం సరిగా లేరనే అర్థం.
మీ భాగస్వామి మిమ్మల్ని వేధించడం, ఇబ్బంది పెట్టడం, నిర్లక్ష్యం చేయడం లాంటివి చేస్తున్నారు అంటే.. మీ మనసు కష్టపెడుతున్నారు అంటే... మీరు ఆ బంధంలో సరిగా లేరని అర్థం.
మీ జీవిత భాగస్వామి ఏ పని చేసినా మీకు చిరాకు కలగడం, అసహ్యం కలగడం లాంటివి జరుగుతున్నాయి అంటే కూడా... వారితో ఉండటం మీకు ఇష్టం లేదని అర్థం.