పెళ్లి తర్వాత అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు.. వాటిని పరిష్కరించే చిట్కాలు..
పెళ్లి తర్వాత జీవితం మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి తర్వాత పని బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా ఉండాలి. వీటివల్ల చాలా మంది అమ్మాయిలు ఒంటరిగా ఫీలవుతారు. దీన్నే పోస్ట్ వెడ్డింగ్ బ్లూస్ అంటారు. మరి దీని నుంచి బయటపడాలంటే అమ్మాయిలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
marriage
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి ఆనందం కలిగించే విషయమే అయినా.. పెళ్లి తేది దగ్గర పడుతున్న కొద్దీ అమ్మాయిల మనసులో ఓ ఒకలాంటి టెన్షన్ మొదలవుతుంది. అంటే పెళ్లి తర్వాత కుటుంబానికి దూరం కావడం, అత్తామామలు ఎలా ఉంటారు? అక్కడ ఎలా నడుచుకోవాలి? ఎలాంటి సమస్యలు వస్తాయి? పని భారం వంటి వివిధ ఆలోచనలతో అమ్మాయిల మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇవే వారిని ఎంతో ఒత్తిడికి గురిచేస్తాయి. ఇక పెళ్లికి ముందు, పెళ్లితర్వాత జీవితం ఖచ్చితంగా మారుతుంది. కానీ వీటికి అమ్మాయిలు అంత తొందరగా అలవాటు పడరు. పెళ్లి తర్వాత బాధ్యతల భారం కారణంగా చాలా మంది అమ్మాయిలు ఒంటరితనంతో బాధపడుతుంటారు. దీనినే పోస్ట్ వెడ్డింగ్ బ్లూస్ అంటారు. మరి వాటి నుంచి అమ్మాయిలు బయటపడాలంటే ఏం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోస్ట్ వెడ్డింగ్ బ్లూస్ అంటే ఏమిటి
పెళ్లైన తర్వాత ఆనందంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వల్ల శరీరంలో సెరోటోనిన్, డోపామైన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ మెదడు ఈ హార్మోన్లను ఎక్కువగా అనుభవించినప్పుడు.. వాటి ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ ఫీల్ గుడ్ హార్మోన్లు తగ్గడంతో ఒత్తిడి, విచారం పెరుగుతాయి. దీనికితోడు పెళ్లి ఏర్పాట్ల వల్ల కలిగే అలసట కూడా ఆందోళన కలిగిస్తుంది.
బయోమెడ్ సెంట్రల్ ప్రకారం.. నిద్ర లేకపోవడం, పెరిగిన పనిభారం ఒత్తిడికి ప్రధాన కారణాలు. ఇలాంటి పరిస్థితిలో స్వీయ సంరక్షణకు సమయం ఉండదు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. దీనికితోడు వెడ్డింగ్ ప్లానింగ్ సమయంలో బిజీ బిజీగా ఉండటం, సమయం దొరకకపోవడం వంటివి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. పోస్ట్ వెడ్డింగ్ బ్లూస్ ను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
స్వీయ సంరక్షణ ముఖ్యం
ఎన్ఐహెచ్ ప్రకారం.. స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడితో కూడిన పరిస్థితులను మీరు ఈజీగా నివారించొచ్చు. పెళ్లి తర్వాత.. పెళ్లికి ముందు లైఫ్ ను గుర్తుచేసుకుని నిరాశ చెందకుండా.. ఈ రోజు లో గడపండి. అలాగే కొత్త జీవితాన్ని సంతోషంగా స్వాగతించండి. మీ భాగస్వామికి విలువనివ్వండి. అలాగే అతని అంగీకారంతో కొత్త జీవిత లక్ష్యాలను సెట్ చేయండి.
వైవాహిక జీవితాన్ని ఆస్వాదించండి
పెళ్లి తర్వాత సమయాన్ని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కేటాయించండి. అలాగే మీ అవగాహనను పెంచుకోండి. కలిసి ఎక్కువ సమయం గడపండి. పెళ్లి తర్వాత ఉత్సాహాన్ని పెంచడానికి సినిమాలు, విందులు, ప్రయాణాలకు వెలితే.. మీ జీవితంలో థ్రిల్ పెరుగుతుంది. అలాగే ఒంటరిగా కూడా అనిపించదు.
సెక్స్ జీవితానికి సమయం ఇవ్వండి
పనిభారం నూతన వధూవరుల జీవితాలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఈ సమయంలో ఒకరికొకరు కొంత సమయం కేటాయించండి. అలాగే సెక్స్ షెడ్యూల్ ను సిద్ధం చేయండి. దీంతో మీరు భాగస్వామికి సమయం ఇవ్వొచ్చు. ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ధ్యానం చేయండి
పదేపదే తలెత్తే ఆలోచనలను నియంత్రించడానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. పెళ్లికి ముందు లైఫ్ అలా ఉండే.. ఇలా ఉండే అని ఆలోచించడానికి బదులుగా కాసేపు ధ్యానం చేయండి. ఇది మీ మనస్సులో కలిగే ఆలోచనలకు బ్రేక్ వేస్తుంది. అలాగే మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.