ఫస్ట్ నైట్ రోజు పురుషులు చేసే కామన్ మిస్టేక్స్ ఇవే..!
ఇలాంటి పొరపాటు మాత్రం అస్సలు చేయకపోవడం మంచిది. అలాకాదు.. మేం ఉదయం తాగం.. రాత్రి కాదు అంటారా..? మీరు ఉదయం తాగిన మందు.. రాత్రి మీ పనితీరును దెబ్బ తీస్తుందనే విషయం గుర్తంచుకోవాలి.
ఫస్ట్ నైట్ అనగానే ఎవరిలో అయినా కొంత ఉత్సాహం, బెరుకు, ఆందోళన కలగడం చాలా సహజం. ఆ రోజు కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
అయితే.. ఈ ఫస్ట్ నైట్ అనగానే.. అమ్మాయిల్లో ఆందోళన ఉన్నట్లే అబ్బాయిల్లో ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో.. చాలా మంది కామన్ గా తప్పులు చేస్తుంటారట. తొలి రాత్రి రోజు అబ్బాయిలు ఎలాంటి తప్పులు చేయకూడదో ఓసారి చూసేద్దాం..
చాలా మంది అబ్బాయిలు పెళ్లి అనగానే.. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటారు. ముఖ్యంగా మందు పార్టీలు చేసుకుంటారు. ఈ క్రమంలో స్నేహితులు బలవంత పెట్టారంటూ చాలా మంది మందు తాగేస్తూ ఉంటారు.
అయితే.. ఇలా ఫస్ట్ నైట్ మందు తాగి.. అమ్మాయి దగ్గరకు వెళ్లడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి పొరపాటు మాత్రం అస్సలు చేయకపోవడం మంచిది. అలాకాదు.. మేం ఉదయం తాగం.. రాత్రి కాదు అంటారా..? మీరు ఉదయం తాగిన మందు.. రాత్రి మీ పనితీరును దెబ్బ తీస్తుందనే విషయం గుర్తంచుకోవాలి.
ఇక చాలా మంది అబ్బాయిలు.. సినిమాలు చూసి.. అందులో చూపించినవి చూసి.. నిజంగా తొలి రాత్రి అంటే ఇలానే ఉంటుంది.. అనే భ్రమలో ఉంటారు అయితే.. సినిమాల్లో చూపించినట్లుగా ఉండదు అనే విషయాన్ని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. సినిమాలు చూసి నిజ జీవితంలో అంచనాలు పెంచుకోవడం పొరపాటు అని గ్రహించాలి. లేకుంటే మీ ఫస్ట్ నైట్ నాశనం అవుతుంది.
ఇక చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురౌతుంటారు. కాబట్టి.. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ముందుగా చేయాల్సిన పనులు పూర్తి చేసుకోవాలి. సరిగా.. మీ భార్యతో గడపాల్సిన సమయంలో కంగారుగా.. వేరే పనులు చేయకూడదు.
చాలా మంది పురుషులు పెళ్లి రోజు రాత్రి చాలా హ డావిడి చేస్తారు.తొలిరాత్రే పని పూర్తవ్వాలన్నట్లు చేస్తారు. ఇంతక ముందు ఎప్పుడూ కనీసం అమ్మాయిని కూడా చూడలేదు అన్నట్లుగా.. కరువుగా ప్రవర్తిస్తారు. అలా చేయడం మంచిది కాదు. మీ భార్య సమ్మతి తీసుకోవడం కూడా చాలా అవసరం. ఆ తర్వాత.. కలయిక పై దృష్టి పెట్టాలి.
ఇక పెళ్లి అన్న తర్వాత.. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న గొడవలు జరగడం కూడా చాలా కామన్. ఏర్పాట్లు సరిగా జరగలేదని చాలా గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. వాటిని అక్కడికక్కడే వదిలేయాలి. అలా కాకుండా.. తొలి రాత్రి రోజు..వాటి గురించి మీ భార్యతో గొడవ పడటం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల.. మీ బంధంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.