పెళ్లికి ముందు అమ్మాయిలు కండిషన్స్ విన్నారా..?
వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకొని ఈతరం అమ్మాయిలు.. పెళ్లి విషయంలో మాత్రం ముందుగానే కండిషన్స్ పెడుతున్నారట. వీటన్నింటికీ ఓకే అయితే.. పెళ్లివైపు అడుగులేస్తామని తేల్చిచెబుతున్నారట.
మన దేశంలో పెళ్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనిషి జీవితంలో పెళ్లి కీలక పాత్ర పోషిస్తుంది. నచ్చని తండి తినొచ్చు.. అది సాయంత్రానికి అరిగిపోతుంది. నచ్చని డ్రెస్ వేసుకోవచ్చు.. మరుసటి రోజు విప్పేయచ్చు. ఫ్రెండ్స్ నచ్చకపోతే దూరంగా ఉండొచ్చు. కానీ నచ్చని వాడిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది.
కొందరు విడిపోతున్నారు కదా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు కదా అని మీరు అనొచ్చు. కానీ అందరి విషయంలో అప్లై చేయలేం. ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి కామన్ గా మారినా.. అవి మనసుపై రేపే గాయం మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది.
వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకొని ఈతరం అమ్మాయిలు.. పెళ్లి విషయంలో మాత్రం ముందుగానే కండిషన్స్ పెడుతున్నారట. వీటన్నింటికీ ఓకే అయితే.. పెళ్లివైపు అడుగులేస్తామని తేల్చిచెబుతున్నారట.
అది ప్రేమ పెళ్లి అయినా... పెద్దలు కుదర్చిన పెళ్లి అయినా సరే...ముందు మా కండిషన్స్ తీర్చాక... వాటికి తలూపితేనే అంటూ భీష్మించుకు కూర్చుండటం విశేషం. ఇంతకీ వాళ్లు పెడుతున్న కండిషన్స్ ఏంటో తెలుసా... ఇంకెందుకు ఆలస్యం చదవియండి.
ఒకప్పుడు అబ్బాయి కుటుంబం గురించి అమ్మాయి కుటుంబం వాళ్లు.. అమ్మాయి కుటుంబం గురించి అబ్బాయి కుటుంబం వాళ్లు చెక్ చేసుకుంటారు. అయితే ఇది ఒకప్పుడు కానీ.. రోజులు మారుతున్న కొద్ది.. ఆలోచనా విధానం కూడా మారుతుంది.
ఇప్పుడు ఎవరికి వాళ్లు తమ భాగస్వామిని వారే వెతుక్కుంటున్నారు. తరువాత తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఇక ఆతరువాత ఒప్పుకుంటే సరే.. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే
అయితే ప్రస్తుత రోజుల్లో ఆమ్మాయిలు మాత్రం జీవిత భాగస్వామిని ఎంచుకుని, అతనితో కలసి ఏడడుగులూ నడిచి జీవితాన్ని పంచుకునే మధుర క్షణాలకు ముందు, ఎంతమాత్రమూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదని ఓ కొత్త సర్వే నివేదిక వెల్లడిస్తోంది. పెళ్లి విషయంలో అమ్మాయిల్లోని మనోభావాలపై ప్రశ్నించగా వారు కొన్ని ఆసక్తికర అంశాలు తెలియజేశారు. అవేంటో చూద్దాం..
ఈ కాలం అమ్మాయిలు పెళ్లి తరువాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు సుముఖంగాలేరట. నలుగురితో కలిసుంటే, తమకు స్వేచ్ఛ ఉండదన్నది వారి భావన.
ఒకవేళ అమ్మాయికి కనుక ఎవరైన నచ్చితే... కులం, మతం, జాతకం వంటివి చూసేందుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదట.
ఒకే ప్రొఫెషన్ లో ఉన్న వారైతే మంచిదని భావిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఒకప్పుడు కాస్త అందంగా ఉండే వాడు వస్తే బాగుంటుంది అనుకున్న అమ్మాయిలే.. ఇప్పుడు ప్రొఫెషన్ తరువాతే అందాన్ని చూస్తున్నారట.
80 శాతం మంది యువతులు విదేశీ వరుడు కావాలని కోరుకుంటుండగా, 65 శాతం మంది కుల మతాలతో పని లేదని, 50 శాతం మంది జాతకాలు చూడాలని అనుకోవడం లేదని అన్నారట.