భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందా అయితే ఈ టిప్స్ పాటించండి!
ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని బలపడేలా చేసేదే వివాహ బంధం (Marriage bond). పెళ్లయిన కొత్తలో భార్య భర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. కొన్ని సంవత్సరాల తరువాత వారి పని ఒత్తిడి, ఉద్యోగ ఆర్థిక సమస్యల వల్ల ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే సమయం లేక మనస్పర్ధలు (Conflicts) వస్తుంటాయి.
ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని బలపడేలా చేసేదే వివాహ బంధం (Marriage bond). పెళ్లయిన కొత్తలో భార్య భర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. కొన్ని సంవత్సరాల తరువాత వారి పని ఒత్తిడి, ఉద్యోగ ఆర్థిక సమస్యల వల్ల ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే సమయం లేక మనస్పర్ధలు (Conflicts) వస్తుంటాయి.
ఏ విషయంలోనైనా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం కోల్పోతే వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. భార్య భర్త ఇష్టాయిష్టాలను, భర్త భార్య ఇష్టాయిష్టాలను తెలుసుకుని వారికి అనుగుణంగా (Accordingly) ప్రవర్తించాలి. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను (Love) వ్యక్తపరచుకోవాలి.
జీవితంలో సుఖదుఃఖాలు (Pleasures) వస్తుంటాయి.ఆ సమయంలో తమ బాధలను వ్యక్తపరచుటకు భర్త భార్యకు ఒక మంచి స్నేహితుడుగా ఉండి ఆమెకు ధైర్యం (Courage) చెప్పాలి. ఆ మంచి స్నేహితుడుగా భర్త ఉంటే ఆ భార్య ఎంతో సంతోషిస్తుంది. అన్ని విషయాలలోనూ ఒకరికొకరు తోడుగా సమస్యలను పరిష్కరించుకోవాలి.
భార్యాభర్తల బంధాన్ని మధురంగా చేసుకోవడానికి భార్య కోరికలను (Desires), అవసరాలను భర్త అర్థం చేసుకోవాలి. వైవాహిక జీవితంలో సెక్స్ (Sex) అనేది ముఖ్యం. ఈ కలయిక ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఎంత గొడవ పడిన కలిసి పడుకోవాలి. భార్యా భర్తలు పరస్పరం తోడుగా ఉన్నామని ఆనందిస్తారు.
ఈ శారీరక బంధం ఆత్మీయ సంబంధాన్ని పటిష్టం చేస్తుంది. భార్యాభర్తల మధ్య కలయిక వారి ప్రేమను బలపరుస్తుంది. ప్రేమగా నిజాయితీగా (Honestly) భర్త అభిప్రాయాలకు గౌరవమివ్వాలి. అప్పుడు ఆ భార్య పైన భర్తకు నమ్మకం, గౌరవం పెరుగుతుంది. భార్య ఆరోగ్య విషయాలను, ఆమె ఇబ్బందులను (Difficulties) ఎప్పటికప్పుడు భర్త తెలుసుకోవాలి.
ఆమెకు తనపై నమ్మకం (Believe) కలిగేలా చూసుకోవాలి. భార్య భర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకుంటే వారి దాంపత్యం ఎప్పుడూ నిత్యయవ్వనంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు (Hides) ఉండకూడదు. భార్యభర్తలు ఒకరికొకరు పాలు నీళ్ళలా కలిసి జీవించాలి.