ఎన్ని ప్రయత్నాలు చేసినా తండ్రి కాలేకపోతున్నారా? ఇవి తింటే పురుషుల బలం పెరుగుతుంది
ప్రస్తుత కాలంలో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువయ్యాయి. ఆడవారిలోనే కాదు మగవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. పురుషుల ఆహారపు అలవాట్లు, జీవనశైలే మగ వంధ్యత్వానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
ఉద్యోగం, ఇంటి బాధ్యత, ఇతరత్రా పనులు పురుషులను ఎంతో ఒత్తిడికి గురి చేస్తాయి. వీటి మూలంగా చాలా మంది మగవారు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే పూర్తిగా మానేస్తారు. ఇక పెళ్లి తర్వాత ప్రతి పురుషుడు వీలైనంత తొందరగా తండ్రి కావాలని భావిస్తాడు. కానీ కొన్ని సమస్యల వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తండ్రులు కాలేకపోతున్నారు. అయితే కొన్ని ఆహారాలు పురుషుల సంతానోత్పత్తి, వీర్యం బాగా పెరిగేందుకు సహాయపడతాయి. అవేంటంటే..
కొవ్వు చేపలు
కొవ్వు చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో . వీటిని తింటే వీర్యకణాల సంఖ్యపెరగడంతో పాటుగా వాటి చలనశీలత కూడా మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో వెళ్లడైంది. చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషులను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ ను తినడం వల్ల మగ సంతానోత్పత్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు, కూరగాయలు
మన దేశంలో ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటుగా ఎన్నో రోగాలువస్తాయి. ఇది మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఇది మీ స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. అలాగే మగ సంతానోత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది.
Image: Getty Images
వాల్ నట్స్
వాల్ నట్స్ మంచి పోషకాల బాంఢాగారం. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మీకు తెలుసా? వాల్ నట్స్ కూడా పురుషుల స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. అందుకే వీటిని తింటే వంధ్యత్వం అనే సమస్యే ఉండదు.