ఈ అలవాట్లు.. మీ మ్యారేజ్ లైఫ్ ని ఆనందంగా మారుస్తాయి..!
ఏవేవో తెలిసీ తెలియని పనులు చేసి.. దాంపత్య జీవితంలో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే.. ఈ కింద అలవాట్లను అలవరుచుకుంటే... మ్యారేజ్ లైఫ్ ఆనందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty Images
మ్యారేజ్ లైఫ్ ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. ఎలా సంతోషంగా ఉండాలి అనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ ఉండదు. ఏవేవో తెలిసీ తెలియని పనులు చేసి.. దాంపత్య జీవితంలో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే.. ఈ కింద అలవాట్లను అలవరుచుకుంటే... మ్యారేజ్ లైఫ్ ఆనందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం..
1.దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే... వారి శృంగార జీవితం కూడా అంతే అందంగా ఉండాలి. కానీ.. చాలా మంది సెక్స్ ని ఏదో మొక్కు బడిగా చేస్తుంటారు. దాని వల్ల దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి... శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.
2.ఏ విషయం గురించి అయినా దంపతులు మనస్పూర్తిగా మాట్లాడుకోవాలి. దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఏ విషయం గురించైనా మాట్లాడుకునేలా ఉండాలి. అప్పుడే.. వారి జీవితం ఆనందంగా ఉంటుంది. ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
3.దంపతులు.. జీవితంలో తమ ముందు ఉన్న లక్ష్యాలు ఎంటి.? దాని కోసం తమ జీవిత భాగస్వామి ఎంత వరకు సహాయం చేయగలరు..? ఎంత వరకు అర్థం చేసుకోగలరు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ విషయం గురించి చర్చించుకోవాలి.
4. మీరు ఎంత బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పటికీ.. రోజులో ఏదో ఒక భోజనం.. ఇద్దరూ కలిసి తినేలా ప్లాన్ చేసుకోవాలి. అది ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కానీ.. ఇద్దరూ కలిసి ప్రశాంతంగా భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
5.కొన్ని కొన్ని ఇంట్లో పనులు ఇద్దరూ కలిసి చేసుకోవాలి. కలిసి ఆడుకోవడం, వంట ఇద్దరూ కలిసి చేయడం.. లేదంటే... ఒకరికొకరు సహాయం చేసుకోవడం, సరుకులు కొనుక్కోవడానికి ఇద్దరూ కలిసి వెళ్లడం లాంటివి చేయాలి.
6.మీ పార్ట్ నర్ ఏం చెబుతున్నారు అనేది వినడం అలవాటు చేసుకోవాలి. ఎంత సేపటికీ మీరు వాదించడమే కాదు.. ఎదుటివారు చెప్పేది వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు.. దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
7. ఇంట్లో ప్రతి పనిని ఒక్కరే చేయాలని రూల్స్ పెట్టుకోకూడదు. ప్రతి పనిని ఇద్దరూ షేర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా చాలా అవసరం.