శృంగారం బోరింగ్ గా అనిపించకూడదంటే ఈ ట్రిక్స్ ను ట్రై చేయండి
కొంతమందికి సెక్స్ ప్రతిసారీ ఒకే ఆనందాన్ని ఇవ్వదు. కొంతమందికి బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మీరు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ బాగా ఎంజాయ్ చేస్తారు.
పురుషులు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ త్వరగా భావప్రాప్తిని పొందుతారు. కానీ మహిళల విషయంలో అలా జరగదు. చాలా మంది మహిళలు అప్పుడప్పుడు మాత్రమే భావప్రాప్తిని పొందుతారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీని గురించి పట్టించుకుంటారు. స్త్రీలకు కూడా కోరికలు ఉంటాయి. కానీ వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నిజమేంటంటే? ఆడవారు భావప్రాప్తిని పొందేందుకు చాలా సమయం పడుతుంది. అయితే వీరు క్లైమాక్స్ కు చేరుకోవడానికి కొన్ని ట్రిక్స్ బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే?
=
ఒక అధ్యయనం ప్రకారం.. కొన్నిసార్లు జననేంద్రియాల్లో ఉద్దీపన లయబద్ధంగా సంభవిస్తుంది. జననేంద్రియ ఉద్దీపన ఆడవారు భావప్రాప్తి పొందేందుకు సహాయపడుతుంది. అయితే ఇలా అందరి మహిళలకు సంభవిస్తుందని చెప్పలేం.
అయితే చాలా మంది మహిళలు భావప్రాప్తికి చేరుకోకపోవడానికి ఒత్తిడే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. స్ట్రెస్, యాంగ్టైటీ వంటి సమస్యలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మరి సెక్స్ లో ఆనందాన్ని పొందడానికి ఎలాంటి ట్రిక్స్ ను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోర్ ప్లే
సెక్స్ కంటే పూర్తి సమయాన్ని ఫోర్ ప్లేకు కేటాయించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫోర్ ప్లే మిమ్మల్ని సెక్స్ కు సిద్ధం చేస్తుంది. ఇది మీరు మరింత ఆనందాన్ని పొందడానికి సహాయపడుతుంది. అందుకే శృంగారానికి ముందు ఫోర్ ప్లేలో పాల్గొనండి. ఇది మీ మెదడు, మీ గుండె లయను కొద్దిగా మారుస్తుంది.
=
కెగెల్ వ్యాయామాలు
కెగెల్ వ్యాయామాలు కటి కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇది భావప్రాప్తిని పొందడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు ఇంట్లోనే బ్రిడ్జ్ భంగిమ, జంపింగ్ జాక్స్, స్క్వాట్ వంటి కొన్ని సాధారణ కెగెల్ వ్యాయామాలను చేయొచ్చు. ఇవి క్లైమాక్స్ ను మరింత మెరుగ్గా చేస్తాయి.
మెడ, చెవులు
కొన్ని శరీర భాగాలు మిమ్మల్ని లైంగికంగా ప్రేరేపిస్తాయి. మెడ, చెవుల వెనుక తాకడం వల్ల మీ జననేంద్రియాలు ఉత్తేజితం అవుతాయన్ని సంగతి మీకు తెలుసా? ఇక్కడి భాగాలను తాకడం వల్ల మీ లిబిడో పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే సెక్స్ లో పాల్గొనడానికి ముందు వీటిని తాకండి. కొన్నిసార్లు భావోద్వేగం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మీరు క్లైమాక్స్ కు చేరుకోలేరు. అందుకే మీ రొమాంటిక్ మూమెంట్స్ ను వృథా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి.