పడక గదిలో రెచ్చిపోవాలంటే మగాళ్లు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవి..
పడకగదిలో రెచ్చిపోవడానికి కూడా కొన్ని రకాల ఫుడ్స్ చాలా అవసరమని చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
మనం జీవించాలంటే ఆహారం చాలా అవసరం. ఈ భూమి మీద ఏ మనిషి జీవించాలన్నా.. వారికి ఆహారం కావాల్సిందే. అయితే.. కేవలం కడుపు నిండటానికి మాత్రమే కాదు.. చాలా విషయాలకు కూడా ఆహారం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అందం, ఆరోగ్యానికి కూడా ఆహారం అవసరం. ఇక పురుషుల విషయానికి వస్తే.. వారు పడకగదిలో రెచ్చిపోవడానికి కూడా కొన్ని రకాల ఫుడ్స్ చాలా అవసరమని చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
పళ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలతో కూడిన మెడిటరేనియన్ డైట్‌తో వీర్యం నాణ్యత పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న సంతానలేమి సమస్యకు ఈ ఆహారం కొంతమేర పరిష్కారం చూపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ రోవిరా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా ప్రస్తుతం 15 శాతం దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారని వారు తెలిపారు. ఈ తరహా కేసుల్లో ప్రధాన కారణం మగవారేనని, 25 శాతం కేసుల్లో వీర్యం నాణ్యత లోపం వల్లే పిల్లలు పుట్టడంలేదని వైద్య నివేదికలలో వెల్లడైందని చెప్పారు.
డ్రైఫ్రూట్స్, నట్స్.. ఇవి చాలా అవసరం. వీటిని కడుపునిండా తినాల్సిన అవసరం లేదు. రోజుకి పది వరకు తింటే చాలు.. పురుషుల్లో వీర్యాభివృద్ధి బాగా పెరుగుతుంది.
రోజూ నట్స్ తినడం అలవాటు చేసుకుంటే.. కేవలం 14 వారాల్లో వీర్యంలో నాణ్యత బాగా పెరగుతుుందని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా.. నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వీర్యాభివృద్ధి బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొందరు యువకుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా తేలింది. మొత్తం 72మందిపై పరిశోధన చేయగా.. వారిని రెండు భాగాలుగా విడతీశారు.
వారిలో సగం మందికి ప్రతిరోజూ 60గ్రాముల నట్స్ ని ఆహారంగా ఇచ్చి.. మిగిలిన వారికి మాంసాహారం, రెడ్ మీట్, షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ లాంటివి ఇచ్చారు.
నట్స్ ఆహారంగా తీసుకున్నవారిలో వీర్యభావృద్ధి బాగా పెరిగినట్లు గుర్తించారు. మిగిలిన వారితో పోలిస్తే.. వీరిలో తేడా బాగా కనపడింది. కాబట్టి వీర్యంలో నాణ్యత పెరగాలంటే కచ్చితంగా.. నట్స్ ని డైట్ లో భాగం చేసుకోవాలి.
గుమ్మడికాయ గింజలు..
గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. లిబిడో స్థాయిని పెంచడానికి ఇది చాలా సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్ లో ఆమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. ఇవి కూడా వీర్యంలో నాణ్యత పెరగడానికి ఉపయోగపడతాయి.
దానిమ్మ కూడా వీర్యాభివృద్ధికి సహాయపడుతుంది. ఇది బెస్ట్ సూపర్ ఫ్రూట్ గా మనం చెప్పుకోవచ్చు.
విటమిన్ బి ఎక్కువగా ఉండే పాలకూర, మొలకలు లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. బత్తాయిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. టమాటలో సైతం విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. వీర్యం వృద్ధి చెందుతుంది.