మగాడ్ని గ్రిప్ లో పెట్టుకోవడానికి ఆయుధం.. బెడ్రూంలో పనిచేస్తుందా?
చాలా మంది మహిళలు.. భర్తలను గ్రిప్ లో పెట్టుకోవడానికి వీక్ మూమెంట్ కోసం ఎదురుచూస్తారట. అంటే.. వారి కోరికలు తీరిస్తేనే నీ కోరిక తీరుస్తానంటూ బెట్టు చేస్తుంటారట. అది అప్పటిరవకు వర్కౌట్ అయినా.. తర్వాతర్వాత సమస్యలు తెచ్చిపెడుతందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు ఆడవారు ఉద్యోగాలు చేసేవారు కాదు.. మగవాడు పొద్దున ఇంటిని ఆఫీసుకు వెళ్లి... తిరిగి సాయంత్రానికి చేరుకునే సరికి... భార్య అన్నీ సిద్ధం చేసేది. కమ్మగా భోజనం సిద్ధం .. అందంగా ముస్తాబై భర్త రాకకోసం ఎదురు చూసేది. కానీ ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవు.
ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి వర్క్ ప్రెజర్ వాళ్లకు ఉండే ఉంటుంది. అవన్నీ మర్చిపోయి... ప్రశాంతంగా పది నిమిషాలు మాట్లాడుకోవడానికి కూడా దంపతులకు కుదరడం లేదు. మాటలకే కరువైనప్పుడు ఇక కాపురం ఏం సాగుతుంది.
రాత్రి పడుకునే సమయంలోనే చాలా మందికి కాస్త సమయం దొరుకుతుంది. అప్పుడు కూడా ఉద్యోగం విషయాలు, ఇతర సమస్యలు, పిల్లలు, ఇలా తదతర విషయాలు మాట్లాడేస్తున్నారు.
అయితే... ఇలాంటి విషయాలు మాట్లాడితే.. మగాడికి ఉన్న కాస్తంతా మూడ్ పోయి.. టోటల్ గా సెక్స్ లైఫ్ కి దూరమైపోతున్నారు.
అయితే.. దీనిపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అసలు పడక గదిలో దంపతులు ఏ విషయాలు మాట్లాడుకోకూడదో చెబుతున్నారు. శృంగారం సమయంలో ఏ టాపిక్ కి దూరంగా ఉంటే.. వారి సెక్స్ లైఫ్ అంత అందంగా ఉంటుందని చెబుతున్నారు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి.
చాలా మంది మహిళలు.. భర్తలను గ్రిప్ లో పెట్టుకోవడానికి వీక్ మూమెంట్ కోసం ఎదురుచూస్తారట. అంటే.. వారి కోరికలు తీరిస్తేనే నీ కోరిక తీరుస్తానంటూ బెట్టు చేస్తుంటారట.
అది అప్పటిరవకు వర్కౌట్ అయినా.. తర్వాతర్వాత సమస్యలు తెచ్చిపెడుతందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శృంగారాన్ని... మాట నెగ్గించుకోడానికి ఆయుధంగానో, తనదే పైచేయి అని చాటుకోడానికి ఓ అవకాశంగానో, కోపాన్ని వ్యక్తం చేయడానికి మార్గంగానో భావిస్తే చాలా తప్పు. దాంపత్య బంధానికి అదో వెన్నుపోటులాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దానివల్ల తామూ నష్టపోతారు, భాగస్వామికీ నష్టం కలిగిస్తారు. తమలో లోపాలుంటే సరిచేసుకోవాలి, భాగస్వామిలో లోపాలుంటే సరిదిద్దాలి, సరిదిద్దుకోడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది, బలపడుతుందని సూచిస్తున్నారు.
కేవలం ఆడవారే కాదు.. కొందరు మగవారు చేసే కొన్ని పొరపాట్లు కూడా భార్యభర్తలను శృంగారం విషయంలో దూరంగా ఉండేలా చేస్తుంది.. అందులో మొదటిది నోటి దుర్వాసన, చెమట, పరిశుభ్రత.
చాలా మందికి సిగరెట్లు తాగడం, గుట్కా, పాన్ వంటివి నమిలే అలవాటు ఉంటుంది. అలాంటివాళ్లు రోడ్డు మీద కాసేపు పక్కనుండి వెళితే.. ఆ వాసన భరించలేము. అలాంటి అలాంటి వాసన వచ్చే వ్యక్తితో ఏ స్త్రీ అయినా.. రొమాన్స్ కానీ, కాపురం కానీ చేయగలదా..?
ఏంత కావాలని కోరుకున్నా... అలాంటి వాసనతో దగ్గరకు వెళితే.. అప్రయత్నంగానే వద్దు అనేస్తారు. వారి వద్దు సమాధానంతో.. మగాడిలో సహనం కోల్పోతుంది. కాబట్టి.. ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
‘సెక్స్ టైమ్’ అనేది కుటుంబ విషయాల చర్చా వేదిక కాకూడదు. అప్పుల గురించీ ఆస్తుల గురించీ బాధ్యతల గురించీ బరువుల గురించీ సరిగ్గా ఆ సమయంలోనే సీరియస్ చర్చ లేవనెత్తుతుంటారు... ఇద్దర్లో ఎవరో ఒకరు. దీంతో, అవతలి వ్యక్తిలోని ఉత్సాహం పాలపొంగు మీద నీళ్లు పోసినట్టు చల్లారిపోతుంది.
లైంగిక బంధం బీటలు బారడానికి అనేక కారణాలు. శృంగార జీవితానికి తొలి శత్రువు ఒత్తిడే. పెళ్లయి ఎన్నేళ్లు గడిచినా ఎంతోకొంత ఒత్తిడి ఉంటుంది.
మగవారికైతే లైంగిక సమర్థతకు సంబంధించీ, ఆడవారిలో అయితే శరీర సౌష్ఠవం గురించీ. అవతలి వ్యక్తి ప్రేమతో, చొరవతో ఆ ఒత్తిడిని కరిగించాలి. ‘నువ్వో అద్భుతమైన వ్యక్తివి’ అన్న భావన కలిగించాలి. అంతేకానీ లోపాల్నీ బలహీనతల్నీ ఎత్తి చూపకూడదు. ఎత్తిపొడుపులూ, వెటకారాలూ లైంగిక దూరాన్ని పెంచుతాయి.
ఏదో సినిమాలో చెప్పినట్లు.. మనం మన జీవిత భాగస్వామిపై ఎంత ప్రేమ చూపితే..అంత ప్రేమ మనకు తిరిగి దక్కుతుంది. నువ్వు ఈ రోజు నిర్లక్ష్యం చూపిస్తే... ఏదో రోజు.. నువ్వు ప్రేమ కోరుకున్న రోజు.. నీకు అదే నిర్లక్ష్యం ఎదురు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి.. ఎవరికివారు తమ జీవితభాగస్వామి నచ్చేలా మెచ్చేలా తమను మార్చుకుంటే.. జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతున్నారు.