ప్రేమికుల కొంప ముంచిన కరోనా.. ముద్దులు, హగ్గులకు నో..!
ఈ వైరస్ సోకినవారికి ఇక ముద్దు పెట్టుకుంటే వారికి కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ప్రేయసీప్రియులు, దంపతులు బయట ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరించారు.
వాలంటైన్స్ డే... ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. తమదైన రోజున ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. చాలా మంది ప్రేమికులు ఇంట్లో వాళ్ల కళ్లుకప్పి.. బయటకు చెక్కేస్తారు. ముందుగానే.. ఈ రోజుని స్పెషల్ గా గడిపేందుకు ఎవరికి తగ్గట్టు వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటారు.
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ప్రేమికులన్నా.. కాస్తంత రొమాన్స్ ఉండటం కామన్. అందులో ముద్దులు, హగ్గులదే ప్రధాన పాత్ర. మనదగ్గర కాకపోయినా.. ఇతర దేశాల్లో ప్రపోజ్ చేయగానే లిప్ టూ లిప్ కిస్ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివారందరికీ .. ఈ వాలంటైన్స్ డే మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది.
అయితే.... ఈ ప్రేమికుల దినోత్సవం మాత్రం ఎలాంటి ముద్దులు, హగ్గులు లేకుండా చేసుకోవాల్సిందేనని అధికారులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇదంతా కరోనా మాయ. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. జలుబు, జ్వరం, తుమ్ము, దగ్గు వంటి లక్షణాలతో మొదలౌతున్న ఈ వైరస్ ప్రాణాలను హరిస్తుంది.
ఈ వైరస్ సోకినవారికి ఇక ముద్దు పెట్టుకుంటే వారికి కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ప్రేయసీప్రియులు, దంపతులు బయట ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరించారు.
కరోనా వైరస్ సోకకుండా దంపతులు, ప్రేయసీప్రియులు ముద్దూ ముచ్చట్లకు దూరంగా ఇంట్లోనే సంతోషంగా గడపాలని నిపుణులు సలహా ఇచ్చారు. వాలంటైన్స్ డే సందర్భంగా రెస్టారెంట్లకు జంటగా డిన్నర్లకు వెళ్లడం సర్వసాధారణమే అయినా వైరస్ ప్రబలుతున్నందున ఇంట్లోనే ఇద్దరూ కలిసి స్పెషల్ వంటకాలు చేసుకొని ఒకరికొకరు ప్రేమతో భోజనం చేయాలని నిపుణులు సూచించారు.
ప్రేమికుల దినోత్సవం రోజు సినిమా థియేటరుకు వెళ్లి కలిసి సినిమా చూస్తుంటారని కాని, ఇంట్లోని హోం థియేటరులోనే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లలో సినిమా చూడవచ్చని సూచిస్తున్నారు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం రోజు జంటగా వీడియో గేమ్స్ ఆడుకోవచ్చని సలహా ఇచ్చారు.
ఇంట్లో సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి, పూలు, విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించి రొమాంటిక్ టచ్ తో ప్రేమికుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో కదా వైరస్ మనకు రాదులే అని తేలిగ్గా తీసుకులేం . ఎందుకంటే ఇఫ్పటికే మనదేశానికి కూడా వైరస్ పాకేసింది. ఈ వైరస్ వెంటనే కూడా కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి ముద్దులు, హగ్గులు లేకుండా ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండటం ఉత్తమం.