భగవంత్ మాన్ పెళ్లి చేసుకోబోతున్న గురుప్రీత్ కౌర్ ఎవరు?.. వారిద్దరికి ముందే పరిచయం ఉందా?
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన గురువారం (జూలై 7) వివాహం చేసుకోనున్నారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో నెటిజన్లలో విపరీతమైన చర్చ మొదలైంది.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన గురువారం (జూలై 7) వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుక చండీగఢ్‌లోని భగవంత్ మాన్ ఇంట్లో సింపుల్‌గా జరగనుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న 7 ఏళ్ల తర్వాత భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకుంటున్నారు. ఇక, భగవంత్ మాన్ కొన్నేళ్ల కిందట Inderpreet Kaurను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు Dilshan Mann, Sirat Kaur Mann ఉన్నారు. (ఫొటో- మొదటి భార్య, పిల్లలతో భగవంత్ మాన్)
అయితే 2015లో భగవంత్ మాన్, ఇందర్‌ప్రీత్ కౌర్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ మాన్ ఇద్దరు పిల్లలు.. వారి తల్లితో కలిసి యూనైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ఇద్దరు పిల్లలు వచ్చారు.
ఈ పెళ్లి సెట్ చేసింది ఎవరంటే.. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో నెటిజన్లలో విపరీతమైన చర్చ మొదలైంది. భగవంత్ మాన్ పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు, ఈ పెళ్లి ఎక్కడ జరగనుంది, ఈ పెళ్లి ఎవరు సెట్ చేశారు.. వంటి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పలు ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్‌ల వివాహాన్ని ఆయన తల్లి, సోదరి ఏర్పాటు చేశారు. భగవంత్ మాన్ కుటుంబానికి గుర్‌ప్రీత్ చాలా సన్నిహితురాలని చెబుతున్నారు.
డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఎవరు..డాక్టర్ గురుప్రీత్ కౌర్ పంజాబ్‌లోని ఒక సాధారణ కుటుంబానికి చెందినవారని మీడియా రిపోర్ట్స్ పేర్కొంటున్నారు. భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అయితే ప్రస్తుతం ఆమె గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు.
సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం.. భగవంత్ మాన్ వివాహం అతని ఇంట్లో ఒక చిన్న ప్రైవేట్ వేడుకగా జరగనుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు.